Himanshu Health : కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు గాయం.. ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్.. అసలేమైందంటే?
Himanshu Health : కేటీఆర్ తనయుడు హిమాన్షుకు స్వల్ప గాయమైంది. చికిత్స నిమిత్తం ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించగా ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కేసీఆర్ కూడా తన మనవడిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లినట్టు తెలుస్తోంది.
KCR's Grandson Himanshu
Himanshu Health : మాజీ సీఎం కేసీఆర్ మనవడు, మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు గాయమైంది. గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) ఆస్పత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. జిమ్లో వర్కవుట్స్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ హిమాన్షు ముక్కుకు గాయమైంది. దాంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే చికిత్స నిమిత్తం ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు హిమాన్షుకు ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ అందిస్తున్నట్టు సమాచారం.
మనవడికి గాయమైందనే విషయం తెలియగానే హిమాన్షు (Himanshu Health)ను పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ఏఐజీ ఆసుపత్రికి బయల్దేరి వెళ్లారు. అక్కడ హిమాన్షు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీసినట్టు తెలుస్తోంది.
Read Also : Siya Goyal : ప్రేమ కోసం పక్కా స్కెచ్.. సోనమ్ రఘువంశీ మిస్టేక్స్ స్టడీ చేసిన సియా.. చివరికి పోలీసులకే షాక్!
కేసీఆర్ కూడా ఏఐజీ ఆస్పత్రిలోనే రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్ వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.
కుమారుడు ఆరోగ్యంపై కేటీఆర్ కూడా స్పందించారు. ఈ నెల 6న సాయంత్రం స్పోర్ట్స్ ఇంజురీతో హిమాన్షు గాయపడినట్టు తెలిపారు. ప్రస్తుత ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. స్వల్ప గాయమేనని, కొద్దిరోజుల్లోనే హిమాన్షు పూర్తిగా కోలుకుంటాడని చెప్పారు. కుమారుడి ఆరోగ్యంపై ఆరాదీసిన వారందరికీ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
