Gorati Venkanna : కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు అందుకున్న గోరటి వెంకన్న
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు ఢిల్లీలో వైభవంగా జరిగింది. తెలంగాణకు చెందిన కవి, రచయిత, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు

Gorati Venkanna
Gorati Venkanna : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు ఢిల్లీలో వైభవంగా జరిగింది. తెలంగాణకు చెందిన కవి, రచయిత, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర కంబరా గోరటి వెంకన్నకు అవార్డు ప్రదానం చేశారు.
గోరటి వెంకన్న రచించిన వల్లంకి తాళం కవిత సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. సాహిత్య అకాడమీ అవార్డు రావడం సంతోషంగా ఉందని అవార్డు అందుకున్న గోరటి వెంకన్న అన్నారు.
Also Read : GVL Narasimharao: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. జీవీఎల్ కీలక ప్రకటన
గతంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ద్వారా జస్టిస్ ఎన్వీ రమణ చేతులమీదుగా అవార్డు కూడా తీసుకున్నానని ఈరోజు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో ఉఁడి వారు నన్ను పిలిచి అభినందించటం మాటల్లో చెప్పలేనిది అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.