Moinabad Farm House Case: మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో మరో ట్విస్ట్.. హైకోర్టు కీలక తీర్పు

మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టేసింది. నిందితులను రిమాండ్ కు అనుమతి ఇచ్చింది.

Moinabad Farm House Case: మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో మరో ట్విస్ట్.. హైకోర్టు కీలక తీర్పు

Moinabad Farm House Case

Updated On : October 29, 2022 / 12:53 PM IST

Moinabad Farm House Case: మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో సైబరాబాద్ పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్ పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు నిందితులు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని షరతు విధించింది. శనివారంకు విచారణ వాయిదా వేసింది.

TRS MLAs Trap Issue : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం .. యాదాద్రిలో తడిబట్టలతో బండి సంజయ్ ప్రమాణం

అయితే, పిటీషన్ పై శనివారం హైకోర్టు విచారణ చేపట్టింది. పోలీసుల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు నిందితుల రిమాండ్‌కు అనుమతి ఇచ్చింది. నిందితులు వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఎదుట లొంగిపోవాలని, 24 గంటల్లో నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశించింది.