దానవయ్య గుట్టలో దీక్షిత్ రెడ్డి మృతదేహం

  • Published By: madhu ,Published On : October 22, 2020 / 10:27 AM IST
దానవయ్య గుట్టలో దీక్షిత్ రెడ్డి మృతదేహం

Updated On : October 22, 2020 / 10:59 AM IST

Kidnappers Killed Deekshit Reddy | Mahabubabad: మహబూబాబాద్ కిడ్నాప్ విషాదంగా ముగిసింది. 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డిని చంపేశారు. అడిగినంత డబ్బు ఇస్తామని దీక్షిత్ తల్లిదండ్రులు ఎంత బతిమాలుకున్నా కిడ్నాపర్లు కనికరించలేదు. ఎక్కడ తాము దొరికిపోతామోనన్న భయంతో అమాయక చిన్నారిని అన్యాయంగా బలి తీసుకున్నారు.



దానవయ్య గుట్టలో దీక్షిత్ రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తమ కొడుకు క్షేమంగా వస్తాడని ఎదురు చూసిన ఆ తల్లిదండ్రుల మాటలను వినిపించుకోలేదు. కొడుకును చంపేశాడని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.



https://10tv.in/mahabubabad-kidnapping-tragedy-dixit-killed/
ఆదివారం సాయంత్రం మహబూబాబాద్‌లో 9 ఏళ్ల దీక్షిత్‌ కిడ్నాప్‌ అయ్యాడు. ఈ ఘటనలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామును 3 గంటలకు కిడ్నాపర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల తర్వాత కిడ్నాప్‌ మిస్టరీని పోలీసులు ఛేదించారు.



నిందితుడు దీక్షిత్ తండ్రి రంజిత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా తెలుస్తోంది. కిడ్నాప్‌ ఎపిసోడ్‌ని సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు. బాలుడ్ని కిడ్నాపర్‌ ఎక్కడి నుంచి ఎత్తుకెళ్లాడు.. ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్లాడు.. తీసుకెళ్లాక ఏం చేశాడు.. దీక్షిత్ పేరెంట్స్‌కి ఎక్కడెక్కడినుంచి ఎలా కాల్ చేశాడనే వివరాలను సేకరించారు.



45 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీక్షిత్ తల్లి మాత్రం తన బిడ్డకు ఎలాంటి అపాయం తలపెట్టొద్దని.. డబ్బు ఎంత కావాలన్నా ఇస్తామని వేడుకుంది. కానీ కిడ్నాపర్ దీక్షిత్‌ను వదల్లేదు. కర్కశంగా చంపేశారు.