Komatireddy Rajagopal Reddy : రేవంత్ రెడ్డి కొత్త బిచ్చగాడు, ఓ వలసవాది.. బీజేపీలో చేర్చుకోవడం కష్టమే..

రేవంత్ బీజేపీలోకి వస్తానంటే ఆలోచించాల్సిందే. రేవంత్ రెడ్డిపై ఉన్న కేసులు చెక్ చేయానలి క్లీన్ ఇమేజ్ ఉన్నవాళ్లనే బీజేపీ చేర్చుకుంటుంది అంటూ రేవంత్ పై సెటైర్లు వేశారు.

komatireddy rajagopal reddy revanth reddy

Komatireddy – Revanth reddy : బీజేపీ నేతల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ కొత్త బిచ్చగాడు అంటూ రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ బీజేపీలోకి వస్తానంటే ఆలోచించాల్సిందే. రేవంత్ రెడ్డిపై ఉన్న కేసులు చెక్ చేయాలని, క్లీన్ ఇమేజ్ ఉన్నవాళ్లనే బీజేపీ చేర్చుకుంటుంది అంటూ రేవంత్ పై సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో వసలవాది.. ఆయన లాంటివాళ్లు మాలాంటివాళ్లను తిరిగి కాంగ్రెస్ లోకి రమ్మని ఆహ్వానించటం హాస్యాస్పదం అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి వచ్చినా.. బీజేపీలో చేర్చుకోవటం కష్టమేనని అన్నారు.

Komatireddy Rajagopal Reddy : కాంగ్రెస్‌‌లో చేరుతున్నారనే వార్తలపై కోమటిరెడ్డి క్లారిటీ

కాంగ్రెస్ నుంచి వచ్చేసిన వారిని తిరిగి కాంగ్రెస్ కి చేరమని అడుగుతున్నారు. కానీ బీజేపీలోకి ఓ లక్ష్యం కోసం వచ్చాం. ఎట్టి పరిస్థితుల్లోనే బీజేపీని వీడేదిలేదు అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ గురించి ఆయన కుటుంబం గురించి కూడా వ్యాఖ్యలు చేస్తు.. కేసీఆర్ కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు జైలుకు వెళ్ళటం ఖాయం అని అన్నారు. కొత్తగా చేరిన వారికి కూడా అవకాశాలిస్తే.. బీజేపీ మరింత బలోపేతమవుతోందని అన్నారు. బలమైన నేతలను బీజేపీ నాయకత్వం ఉపయోగించుకోవాలనేదే నా అభిప్రాయం అని అన్నారు రాజగోపాల్ రెడ్డి. అవినీతిపరులపై కఠినంగా వ్యవహరించాలని.. ఆధారాలు కావాలంటే మేమిస్తామని పార్టీకి చెప్పాం అని తెలిపారు.

కాగా.. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక పార్టీలోని నేతలను మరో పార్టీలోకి బహిరంగంగానే ఆహ్వానించుకుంటున్నారు. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలంతా మళ్లీ కాంగ్రెస్‌లోకి తిరిగి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగంగానే ఆహ్వానించారు. దీనికి కౌంటర్ గా రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.