T.Congress : ఉద్యమం మొదలు పెడుతా…నా సంగతి ఏంటో చూపిస్తా
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి - ఎల్లారెడ్డి నుంచి ఉద్యమం మొదలు పెడుతా...నా సంగతి ఏంటో చూపిస్తానంటూ వ్యాఖ్యానించారు.

Komatireddy Venkat Reddy Sensational Comments
Komati Reddy Comments : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి – ఎల్లారెడ్డి నుంచి ఉద్యమం మొదలు పెడుతా…నా సంగతి ఏంటో చూపిస్తానంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ తనకు ప్రాణమని, సోనియా గాంధీ దేవత అంటూ అభివర్ణించారు. 2021, నవంబర్ 06వ తేదీ శనివారం సీఎల్పీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ నేతలే అప్పుడు దయ్యం అని ఇప్పుడు దేవత అంటున్నారని విమర్శించారు. పెద్ద లీడర్లు అని చెప్పుకొని పదవుల పంపకాలు చేసుకున్నారని ఆరోపించారు.
Read More : cancer Medicine : ‘మనతక్కలి’ మొక్కతో క్యాన్సర్ మందు..అధికారికంగా గుర్తించిన అమెరికా ఎఫ్‌డీఏ
72 నుంచి 78 సీట్లు వస్తాయని చెప్పారని తెలిపారు. మంత్రులు. ముఖ్య మంత్రులు పంపకాలు చేసుకున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం. తాను జిల్లా లీడర్ ను వాళ్లంతా పెద్ద గొప్ప లీడర్లు ఎద్దేవా చేశారు. ఏపీలో కాంగ్రేస్ లేదనుకుంటే 6వేల ఓట్లు వచ్చాయని, తెలంగాణలో ప్రభుత్వం వస్తదని చెప్పుకున్నా డిపాజిట్లు రాలేదన్నారు. గెలుపు ఓటములు సహజమన్న కోమటిరెడ్డి కేసీఆర్ ఇక రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల గురించి ఆలోచన చెయ్యాలని సూచించారు.
Read More : Hyderabad : బేగంపేట పేకాట కేసులో కొత్త కోణాలు..అరవింద్ అగర్వాల్ వెనుక రాజకీయ నేత ?
కేటీఆర్ సూటు బూటు వేసుకుంటే పెట్టుబడులు రావని, కాంగ్రేస్ అభివృద్ధి వల్లే ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కేటీఆర్ రైతుల గురించి- వాళ్ళ కష్టాల గురించి మాట్లాడరని ప్రశ్నించారు. రైతుబంధు వల్ల ఎవరికి ఉపయోగం లేదని, చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిని చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.