konda Murali : వరంగల్‌లో కంపెనీలు పెడతానని భూములు తీసుకున్నారు, ఏడేళ్లు అయినా అతీగతీ లేదు : కొండా మురళీ

నేను గూండానైతే నన్ను పిలిచి ఎందుకు పార్టీలోకి తీసుకున్నారు? నేను గుండా నయితే నా ఇంటికి వచ్చి కేసీఆర్ ఎట్లా భోజనం చేశారు..? వరంగల్ లో సురేఖ, పరకాలలో నేను పోటీ చేస్తాం.

konda Murali : వరంగల్‌లో కంపెనీలు పెడతానని భూములు తీసుకున్నారు, ఏడేళ్లు అయినా అతీగతీ లేదు : కొండా మురళీ

konda murali surekha

Updated On : June 19, 2023 / 3:54 PM IST

konda murali surekha : మంత్రి కేటీఆర్ (Minister KTR)వరంగల్‌లో కంపెనీ(Warangal Companies)లు పెడుతున్నానంటూ కొరియా నుంచి హెలికాప్టర్లు పట్టుకొచ్చాడు…ఏడేళ్ల క్రితం కంపెనీ ఏర్పాటు చేస్తానని రైతుల నుంచి భూములు తీసుకున్నారు కానీ ఇప్పటివరకు అతిగతి లేదు అంటూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ (konda murali)విమర్శలు చేశారు. గుండాయిజం చేసేది కొండా మురళి కాదు బీఆర్ఎస్ నేతలే.. ఎక్కడ చూసిన భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. కొండా మురళి ప్రజలకు చేతనైన సేవ చేశాడే తప్ప గుండాయిజం చేయలేదనన్నారు. అసెంబ్లీలో పేపర్లు చింపేయడం మహబూబాబాద్ లో రాళ్లు వేసింది మీరే.. అది గుండాయిజం కాదా? అని ప్రశ్నించారు.

MP Soyam Bapurao : నా సొంత అవసరాల కోసం ఎంపీ లాడ్స్ నిధులు వాడుకున్నా.. తప్పేంటీ..? : ఎంపీ సోయం బాపూరావు

నేను గూండాను అంటూ విమర్శలు చేస్తున్నారు. నేను గూండానైతే నన్ను పిలిచి ఎందుకు పార్టీలోకి తీసుకున్నారు? నేను గుండా నయితే నా ఇంటికి వచ్చి కేసీఆర్ ఎట్లా భోజనం చేశారు..? అని ప్రశ్నించారు. పరకాల నుంచి పోటీ చేసేందుకు నేను రెడీగా ఉన్నానని..దీని గురించి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చర్చిస్తానని తెలిపారు. వరంగల్ (Warangal) లో సురేఖ (konda surekha),పరకాల(parakala )లో నేను పోటీ చేస్తామని తెలిపారు. వరంగల్ లో సురేఖ, పరకాలలో నేను గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు.

ధర్మారెడ్డి (Dharma Reddy)కి ఉత్సాహం ఎక్కువగా ఉన్నట్లుంది.. పరకాల వస్తున్న పోటీ చేస్తా..అప్పుడు చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు. ధర్మారెడ్డికి సంస్కారం ఉందా..? అంటూ ప్రశ్నించారు. జనంలో మాకు ఆదరణ ఉంది..ధర్మారెడ్డి ఇంకొకసారి కుక్క అంటూ మాట్లాడితే కొండా మురళి అంటే ఏంటో చూపిస్తానంటూ హెచ్చరించారు.

Ponnam Prabhakar: సంజయ్ ఓసారి ఆస్పత్రిలో చూపించుకో.. కవిత కోసం సిద్ధంచేసిన జైలు రూం ఏమైందో చెప్పు..