MP Soyam Bapurao : నా సొంత అవసరాల కోసం ఎంపీ లాడ్స్ నిధులు వాడుకున్నా.. తప్పేంటీ..? : ఎంపీ సోయం బాపూరావు

నా ఎంపీ నిధులను నా సొంతానికి వాడుకున్నా తప్పేంటీ? నా ఇంటి నిర్మాణం కోసం, నా కుమారుడు పెళ్లి కోసం నా ఎంపీ లాడ్స్ నిధులు వాడుకుంటే తప్పేంటీ? అని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ.

MP Soyam Bapurao : నా సొంత అవసరాల కోసం ఎంపీ లాడ్స్ నిధులు వాడుకున్నా.. తప్పేంటీ..?  : ఎంపీ సోయం బాపూరావు

Adilabad BJP MP Soyam Bapurao

Adilabad BJP MP Soyam Bapurao : ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఎంపీ లాడ్స్ నిధులను తన సొంతానికి వాడుకున్నానని అలా వాడుకుంటే తప్పేంటీ?అంటూ ప్రశ్నించారు. దీనిపై విపక్షాల నేతలు, సొంత పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు కానీ నా ఎంపీ లాడ్స్ నిధులు నా వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటే తప్పేంటీ? అంటూ విమర్శలను కొట్టిపారేశారు. నా ఇంటి నిర్మాణం కోసం, నా కుమారుడు పెళ్లి కోసం నా ఎంపీ లాడ్స్ నిధులు వాడుకున్నానని అంటూ సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపై విపక్షాలు విమర్శలు సంధిస్తుంటే నేనే చేసిందాంట్లో తప్పేంటీ..? అంటూ ప్రశ్నించారు.

ఎంతోమంది ఎంపీలు ఇలా లాడ్స్ నిధుల్ని ఇష్టానుసారంగా వాడేసుకున్నారు..అలాగే నేను కూడా వాడుకున్నాను..కానీ తాను వాడిన ప్రతీ రూపాయి తిరిగి లబ్దిదారులకు ఇచ్చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. ఎంపీ లాడ్స్ నిధులు సొంతానికి వాడుకున్న విషయంపై వచ్చే విమర్శలను ఏమాత్రం పట్టించుకోనంటూ కొట్టిపారేశారు. ఎంపీ లాడ్స్ నిధులకు సంబంధించిన చెక్కులను పంచుతు ఈ వ్యాఖ్యలు చేశారు సోయం బాపూరావు.

Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి.. ఈసారి ఏ రాష్ట్రంలో అంటే..

కానీ ఇంటి నిర్మాణం కోసం..నా కుమారుడు వివాహం ఖర్చుల కోసం తనవద్ద డబ్బులేదని అందుకే తన ఎంపీ లాడ్స్ నిధులు వాడుకున్నానని చెప్పుకొచ్చారు. కానీ వాటిని రూపాయితో సహా ఇచ్చేస్తున్నానంటూ ఎంపీ బహిరంగంగా చెప్పటంతో అక్కడున్నవారంతా చప్పట్లు కొట్టి అభినందించటం గమనించాల్సిన విషయం.

కాగా..ఎంపీలకు వారి నియోజకవర్గంలో అభివద్ధి పనులు కోసం ప్రభుత్వం కొంత నిధులు కేటాయిస్తుంది. వాటిని నియోగక వర్గం అభివృద్దికోసం అక్కడ ప్రజలు కోసం వినియోగించాలి. అంతే తప్ప వాటిని ఆ సభ్యులు సొంతానికి వినియోగించుకోకూడదు. కాగా..ఎంతోమంది ఎంపీలు వారి నియోజకవర్గానికి కేటాయించిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

Vande Bharat Train: నా కల చెదిరిపోయింది..! వందే భారత్‌కు బదులుగా మరో ట్రైన్.. చెత్త సౌకర్యాలంటూ ఆగ్రహంతో ప్రయాణికుడి ట్వీట్ ..