Vande Bharat Train: నా కల చెదిరిపోయింది..! వందే భారత్‌కు బదులుగా మరో ట్రైన్.. చెత్త సౌకర్యాలంటూ ఆగ్రహంతో ప్రయాణికుడి ట్వీట్ ..

సిద్ధార్ధ పాండే అనే వ్యక్తి న్యూఢిల్లీ నుంచి శ్రీమాతా వైష్ణోదేవి కత్రా మధ్య నడిచే వందేభారత్ రైలులో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ, వందేభారత్ రైలుకు బదులుగా మరో రైలు రావటం, అందులో సౌకర్యాలు అద్వాన్నంగా ఉండటంతో అందుకు సంబంధించిన వీడియోలు తీసి ట్విటర్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ట్వీట్ వైరల్‌గా మారింది.

Vande Bharat Train: నా కల చెదిరిపోయింది..! వందే భారత్‌కు బదులుగా మరో ట్రైన్.. చెత్త సౌకర్యాలంటూ ఆగ్రహంతో ప్రయాణికుడి ట్వీట్ ..

Vande Bharat Train

Vande Bharat Train: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైల్వేశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే కొన్ని రూట్లలో ప్రధాని నరేంద్ర మోదీ వీటిని ప్రారంభించారు. వీటి ద్వారా వేగంగా గమ్యస్థానం చేరుకోవటంతో పాటు నాణ్యమైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ తెలిపింది. దీంతో రైల్వే టికెట్ ధరలుసైతం మిగిలిన ట్రైన్ల ధరలకంటే కొంచెం ఎక్కువే. మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేందుకు ఈనెల 10న సిద్ధార్థ పాండే అనే వ్యక్తి న్యూఢిల్లీ నుంచి శ్రీ మాతావైష్ణోదేవి కత్రా మధ్య నడిచే వందేభారత్ రైలులో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. అతను మొదటిసారి వందే భారత్ రైలు ఎక్కేందుకు ఉత్సాహంగా ఉన్నాడు.

Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి.. ఈసారి ఏ రాష్ట్రంలో అంటే..

రైలుకోసం ప్లాట్ ఫాంపై వేచిఉన్నాడు. వందేభారత్ రైలురాగానే ఎక్కాడు. అప్పుడు తెలిసింది అది వందే భారత్ రైలు కాదని, దాని స్థానంలో వేరే రైలు రావడంతో షాక్ అయ్యాడు. రైలులో సౌకర్యాలుసైతం అద్వాన్నంగా ఉండటంతో అందుకు సంబంధించిన వీడియోలను తీసి సిద్ధార్థ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ట్యాగ్ చేశాడు. తన ట్వీట్ లో తనకు ఎదురైన ఇబ్బందిని వీడియోలతో సహా పోస్టు చేశాడు. దీంతో ప్రస్తుతం సిద్ధార్థ పాండే ట్వీట్ వైరల్ గా మారింది.

Trains Cancellation: రైల్వే ప్రయాణికులు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులపాటు 28 రైళ్లు రద్దు.. ఆ రైళ్ల వివరాలు ఇవే..

సిద్దార్ధ్ పాండే తన ట్వీట్ లో ఇలా పేర్కొన్నాడు.. వందే భారత్‌ రైలులో మొదటి సారి ఎక్కేందుకు ఉత్సాహంగా ఉన్నాను. అయితే వందే భారత్ పేరుతో మరో రైలు రావడంచూసి షాక్ అయ్యాను. వందేభారత్ రైలుకు బందులుగా తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చింది. టాయిలెట్‌లు దయనీయంగా ఉన్నాయి. ఇతర సౌకర్యాలు అధ్వాన్నంగా ఉన్నాయి. అయినప్పటికీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం ఛార్జీలు వసూలు చేశారు అంటూ వాపోయాడు. ఈ ట్వీట్‌లో అధ్వాన్నంగా ఉన్న టాయిలెంట్, ట్రైన్ బోగీలో అసౌకర్యాలను చూపుతూ వీడియోలు షేర్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో రైల్వే శాఖపై విరుచుకుపడుతున్నారు.

ఓ నెటిజన్ ఇలా స్పందించాడు.. కొన్నిసార్లు వందేభారత్ రైలు సాంకేతిక లోపం, కొన్ని నిర్వహణ సమస్యల కారణంగా ఆ రోజు నడవడానికి వీలుండదు. దీంతో రైల్వే అధికారులు అదనపు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులో ఉంచారు. వందే భారత్ ప్రయాణానికి సిద్ధం లేనప్పుడు దీనిని పంపిస్తుంటారు అంటూ చమత్కరిస్తూ ట్వీట్ చేశాడు. పలువురు నెటిజన్లు రైల్వేశాఖకు వ్యతిరేకంగా ట్వీట్లు చేశారు. చివరికి ‘రైల్వే సేవ’ రైల్వే ప్రయాణికులకు సహాయం అందించడానికి ఏర్పాటైన ట్విటర్ హ్యాండిల్ స్పందించి ..  పాండే నుండి వివరాలు సేకరించి.. అవసరమైన చర్యకోసం వారు సమస్యను సంబంధిత అధికారులకు చేరవేస్తామని ట్వీట్ చేశారు.