Konda Surekha: రాహుల్ గాంధీ యాత్రలో కొండా సురేఖకు తీవ్ర గాయాలు.. ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు

ఆమెను హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

konda surekha

Rahul gandhi Yatra: కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ స్కూటీపై వెళ్తూ అదుపుతప్పి పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె ముఖం కుడి భాగంలో గాయాలు కనపడ్డాయి. తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయభేరి యాత్రలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.

భూపాలపల్లిలో ఇవాళ రాహుల్ యాత్ర కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో బైక్ ర్యాలీ జరుగుతుండగా కొండా సురేఖ సొంతంగా స్కూటీ నడిపారు. ఆ సమయంలో అదుపుతప్పి పడిపోయారు. ఆమె చేతికి కూడా గాయాలయ్యాయి. ఆమెను హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

కొండా సురేఖ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆమె విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ముఖం కుడి భాగంలో కొండా సురేఖకు వైద్యులు డ్రెస్సింగ్ వేశారు. ఆమె కుడికాలికి కూడా కట్టుకట్టారు. కొండా సురేఖ తలకి దెబ్బ తగలడంతో వైద్యులు పలు జాగ్రత్తలు చెప్పారు.

మరోవైపు, రాహుల్ గాంధీ విజయభేరి యాత్ర కొనసాగుతోంది. స్థానిక ప్రజలను రాహుల్, కాంగ్రెస్ నేతలు కలిశారు. తాము ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు.