KTR: తెలంగాణలో యువతకు మిగిలింది విలాపమే: కేటీఆర్
"కాంగ్రెస్ యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని గుర్తు చేస్తూనే ఉంటాం" అని కేటీఆర్ అన్నారు.

KTR
“ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదు… యువతకు మిగిలింది విలాపమే” అంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువతను కాంగ్రెస్ నిలువునా మోసం చేసిందటూ ట్వీట్ చేశారు.
“బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లుగా పబ్లిసిటీ. 55,143 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్ బడాయి. ఏడాదిలో కాంగ్రెస్ భర్తీ చేసింది కేవలం 12,527 ఉద్యోగాలు మాత్రమే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగ నియమాక పత్రాలు ఇస్తూ గొప్పలు.
ఇచ్చిన హామీలు మరిచి.. నిరుద్యోగ యువతను మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్ కు అధోగతే. కాంగ్రెస్ యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని గుర్తు చేస్తూనే ఉంటాం. జాబ్ క్యాలెండర్ జాడ లేదు. 2 లక్షల ఉద్యోగాల ఊసు లేదు. కాంగ్రెస్ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చింది 12,527 మాత్రమే.
కాంగ్రెస్ ఇంకా 1,87,473 ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు బాకీ. ఏరు దాటాక తెప్ప తగిలేసినట్లు, అధికారం వచ్చాక కూడా అబద్ధాలతో కాలం గడుపుతున్నారు. నిజం నిప్పులాంటిది. కాంగ్రెస్ మోసాలకు తెలంగాణ జవాబు చెబుతుంది” అని కేటీఆర్ అన్నారు.
ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదు… యువతకు మిగిలింది విలాపమే
ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువతను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లుగా పబ్లిసిటీ
55, 143 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్ బడాయి
ఏడాదిలో… pic.twitter.com/ByvkSDmtkM
— KTR (@KTRBRS) December 4, 2024
అధికారిక ప్రకటన.. మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్.. రేపు సీఎంగా ప్రమాణం