×
Ad

కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి షేక్‌హ్యాండ్‌ ఇవ్వడంపై కేటీఆర్ కామెంట్స్‌.. ఇది చాలంటూనే..

"ఇదే సంస్కారం బయట మాటల్లో ఉంటే బాగుంటుంది" అని అన్నారు.

KTR: తెలంగాణ శాసనసభలో సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ షేక్‌హ్యాండ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. కేసీఆర్ దగ్గరకు వెళ్లి రేవంత్‌ రెడ్డి కరచాలనం చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి రేవంత్‌ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.

“తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పట్ల తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవం ఉంటుంది. కేసీఆర్‌ని సభలో కలిసేంత సంస్కారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఉంటే చాలు. ఇదే సంస్కారం బయట మాటల్లో ఉంటే బాగుంటుంది. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకుల వాతావరణం ఉంటే మంచిదే.

Also Read: అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం.. కేసీఆర్-రేవంత్‌ రెడ్డి షేక్‌హ్యాండ్‌.. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయిన కేసీఆర్

మీసాలు, గడ్డాలు అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మాట్లాడుతూ.. “గడ్డం పెంచిన ప్రతి ఒక్కరు గబ్బర్ సింగ్ కాలేడు. గడ్డాలు పెంచడం చాలా ఈజీ… పాలన చేయడమే కష్టం. రేవంత్ గడ్డం, మీసాలు లేవని నన్ను కాదు రాహుల్‌ను, రాజీవ్‌ను అన్నారు. నేను అంధ్రలో చదివితే తప్పుపడుతున్నారు. రేవంత్‌ రెడ్డి మాత్రం అల్లుడిని ఆంధ్ర నుంచి తెచ్చుకున్నారు” అని కేటీఆర్ చెప్పారు.