KTR : పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలి.. కేంద్రాన్ని డిమాండ్ చేసిన కేటీఆర్
KTR : హైదరాబాద్లో 3315 రూపాయలకు కమర్షియల్ సిలిండర్ ధర అంటే రెస్టారెంట్లు, హోటళ్లు మూత వేసుకునే పరిస్థితి వస్తుంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే లక్షల మంది కార్మికుల ఉపాధికి ఇబ్బంది అవుతుందని కేటీఆర్ అన్నారు.
KTR
KTR : పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కమర్షియల్ సిలిండర్ పై వెయ్యి రూపాయలు పెంచి పేదలకు, కార్మికులకు మేడే కానుకగా మోదీ ఇచ్చారంటూ కేటీఆర్ విమర్శించారు. పెంచిన సిలిండర్ ధరతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Ghaziabad : శ్మశానంలో పెండ్లి చేసుకున్న జంట.. ఆ తరువాత వారికి ఊహించని షాక్.. విచారణ చేపట్టిన అధికారులు
హోటళ్లలో పనిచేసే కార్మికులకు, స్వయం ఉపాధిపైన ఆధారపడిన ప్రతి ఒక్కరికి పెంచిన ధర తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తుందని, మే డే రోజున ప్రధానమంత్రి మోదీ కార్మికులందరికీ మేడే కానుకగా ఈ ధరల పెంపు ఇచ్చారని, వెయ్యి రూపాయల సిలిండర్ ధర పెరగడం వలన ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోయతాయని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్లో 3315 రూపాయలకు కమర్షియల్ సిలిండర్ ధర అంటే రెస్టారెంట్లు, హోటళ్లు మూత వేసుకునే పరిస్థితి వస్తుంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే లక్షల మంది కార్మికుల ఉపాధికి ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే ఇరాన్ – అమెరికా యుద్ధం పేరుతో హోటళ్లలో, రెస్టారెంట్లలో పనిచేసే వారి పరిస్థితి, వాటిపై ఆధారపడిన వ్యక్తుల ఉపాధి తగ్గిపోయింది. చివరికి బ్యాచిలర్లు వాడే చిన్న సిలిండర్ను కూడా మోదీ వదిలిపెట్టలేదు. పెంచిన గ్యాస్ ధరతో రోజువారీ టిఫిన్లు, భోజనం ఖర్చులు భారీగా పెరిగి అందరినీ ఇబ్బంది పెడుతుందని కేటీఆర్ అన్నారు.
ఒకవైపు రూపాయి విలువ పాతాళానికి పడిపోతుంది, మరోవైపు సిలిండర్ల ధర ఆకాశంలోకి పోతుంది. ఒకప్పుడు ఉద్యోగాలు అడిగితే పకోడీలు వేసుకోమన్న మోదీ.. ఈ పెంచిన సిలీండర్లతో పకోడీలు కూడా వేసుకోలేని పరిస్థితికి తీసుకువచ్చారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చమురు ధరలు పెంచి, గ్యాస్ ధరలు పెంచి ప్రజల నుంచి భారీగా దోచుకుంటున్న బీజేపీ ప్రభుత్వం సెస్ (Cess) పేరుతో 65 రూపాయలు ఉన్న పెట్రోల్ని 110 – 120 కి పెంచిందన్నారు. ఇలా అడ్డగోలుగా పెంచిన సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలతో అన్నిటి ధరలు పెరిగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఇంత భారీగా సిలిండర్ ధర పెంచితే సామాన్యుడు బతికేదెట్లా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రం పునరాలోచన చేసి ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరల పెంపు పైన చేయాల్సిన పోరాటాలను గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని, వెంటనే కేంద్రం పెంచిన పెట్రోల్ ధరలను వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ కోరారు.
