KTR: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఖరారు చేశాం.. ఇద్దరి పేర్లు చెప్పిన కేటీఆర్
ఎస్టీ కోటా నుంచి కుర్రా సత్యనారాయణను ఖరారు చేశామన్నారు కేటీఆర్. ఇక బీసీ కోటా నుంచి...

KTR
KTR – Governor Quota MLC: తెలంగాణ(Telangana)లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఖరారు చేశామని మంత్రి కేటీఆర్ ఇవాళ తెలిపారు. తెలంగాణ మంత్రివర్గ (Telangana Cabinet) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై కేటీఆర్ వివరాలు తెలిపారు.
గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను ఖరారు చేశామని కేటీఆర్ వివరించారు. ఎస్టీ కోటా నుంచి కుర్రా సత్యనారాయణను ఖరారు చేశామన్నారు. అలాగే, బీసీ కోటా నుంచి దాసోజు శ్రవణ్‌ను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వీరి ఎంపికకు సంబంధించి గవర్నర్ తమిళిసౌ సౌందర రాజన్ రగ ఎలాంటి అభ్యంతకాోగ ఉండిని భావిస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కేబినెట్ తీర్మానం చేసిందన్నారు. వెంటనే తమ ప్రతిపాదనలను తమిళిసైకి పంపుతామని తెలిపారు. బీజేపీ గవర్నర్ ను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తుందని అన్నారు. గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులను మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదిస్తామని తెలిపారు. అనాథల కోసం అర్పన్ పాలసీని రూపొందిస్తామని తెలిపారు. వారికి ప్రభుత్వమే అన్నీ అవుతుందని తెలిపారు. ఇదో గొప్ప ఆశయమని చెప్పారు.