KTR Kannepalli Pump House: కన్నెపల్లికి వెళ్లకుండా కుట్రలు.. పంప్‌హౌస్ వద్ద కేటీఆర్ ఫైర్.. ఆ నీటిని ఎత్తిపోయాల్సిందే
కన్నెపల్లి(KTR Kannepalli Pump House)కు రాకుండా అడ్డుకోవడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుట్రలు చేసిందని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు.
KTR sensational comments After Visiting Kannepalli Pump House
- కన్నెపల్లికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
- గోదావరి నీరు వృథాపోతోంది.
- నీటిని వెంటనే ఎత్తిపోయాలి.
KTR Kannepalli Pump House: తమను కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు రాకుండా అడ్డుకోవడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుట్రలు చేసిందని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. ఆదివారం భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్‌ను బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ వృథాగా సముద్రం పాలు అవుతున్న గోదావరి జలాలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రస్తుత ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కన్నెపల్లి పంప్ హౌస్(KTR Kannepalli Pump House) పరిధిలో వృథాగా పోతున్న నీటిని వెంటనే ఎత్తిపోసి రైతాంగానికి అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘నీళ్లు ఎప్పుడూ పల్లానికే ప్రవహిస్తాయి’ అనే పాత నానుడిని తారుమారు చేస్తూ, కేసీఆర్ తన ఇంజనీరింగ్ ప్రతిభతో నీటిని ఎగువకు తెచ్చి చూపించారని కొనియాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేశామని, కానీ ప్రస్తుత పాలకులు పంపింగ్ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తూ జలాలను వృథా చేస్తున్నారని విమర్శించారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు సాధన కోసం గతంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో తాము జరిపిన జలదౌత్యం చారిత్రాత్మకమైనదని కేటీఆర్ గుర్తుచేశారు. పొరుగు రాష్ట్రంతో సామరస్యపూర్వకంగా చర్చలు జరిపి, తెలంగాణ ప్రయోజనాల కోసం నీటిని సాధించామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులు పక్కనబెట్టి, కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని నిరంతరాయంగా ఎత్తిపోస్తూ రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కేటీఆర్ హెచ్చరించారు.
