Telangana Cabinet: భూముల ధరలు పెంపు, విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐ ఎంక్వైరీ- తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
కేసీఆర్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని కమిషన్ తేల్చింది. 114 పేజీల రిపోర్ట్ ను జస్టిస్ లోకూర్ ప్రభుత్వానికి సమర్పించారు.
Telangana Cabinet Decisions: తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేరళలో కాంగ్రెస్ విజయం సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్ కి అభినందనలు తెలిపారు క్యాబినెట్ సహచరులు. భూముల ధరల పెంపకంపై మంత్రివర్గంలో చర్చించారు. స్వల్పంగా ధరలు పెంచాలని నిర్ణయించారు. ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐకి ఫిర్యాదు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
హజ్ యాత్రికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెరిగిన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం హజ్ యాత్రపై పడింది. హజ్ యాత్ర ఖరీదు భారీగా పెరిగింది. ఇంధన ధరల పెరుగుదలతో యాత్రికులపై అదనపు భారం పడుతోంది. ఈ ఏడాది సుమారు 7 వేల మంది హజ్ యాత్రికులు నమోదు చేసుకున్నారు. పేద ముస్లింలకు ఊరట కలిగించేలా క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో యాత్రికులకు అండగా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
విద్యుత్ కొనుగోళ్ల అంశాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని క్యాబినెట్ తీర్మానం చేసింది. కేసీఆర్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని కమిషన్ తేల్చింది. 114 పేజీల రిపోర్ట్ ను జస్టిస్ లోకూర్ ప్రభుత్వానికి సమర్పించారు. కేబినెట్ లో చర్చించి అడ్వకేట్ జనరల్ కు ఇచ్చాం.
పొరుగు రాష్ట్రాలతో వారి స్వార్ధానికి అవకతవకలకు పాల్పడింది. ఈ రిపోర్ట్ ను సీబీఐకి అందివ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అంతరాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం అంశాలు ఉండటంతో సీబీఐకి ఇవ్వాలని నిర్ణయించింది.
భూముల విలువలను సైంటిఫిక్ గా పెంచాలని నిర్ణయించాం. ప్రభుత్వ ప్రాజెక్ట్ ల అవసరాల కోసం భూముల విలువ పెంచాలని రైతులు కోరారు. నాలుగేళ్ల తర్వాత భూముల విలువ పెరుగుతుంది. పెంచకముందు హిల్ట్ పాలసీలో దరఖాస్తు చేసుకున్న వారికి పాత వ్యాల్యూ వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా వరి మొక్క జొన్నల విషయంలో అభద్రతా భావం లేకుండా చూడాలని కాబినెట్ తీర్మానం చేసింది. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం రెండు పంటల కొనుగోలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
Also Read: విజయ్ సంచలనం.. పోటీ చేసిన రెండు చోట్లా విజయం
