Earthquake In Adilabad : ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో స్వల్ప భూకంపం

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూరులో స్వల్పంగా భూమి కంపించింది. బుధవారం రాత్రి 11.23 గంటల సంమయంలో మండల కేంద్రంలో భూకంపం సంభవించింది. అందరూ నిద్రలో ఉన్న సమయంలో భూ ప్రకంపణలు సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

Earthquake In Adilabad : ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో స్వల్ప భూకంపం

earthquake in adilabad

Updated On : October 13, 2022 / 9:11 AM IST

Earthquake In Adilabad : ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూరులో స్వల్పంగా భూమి కంపించింది. బుధవారం రాత్రి 11.23 గంటల సంమయంలో మండల కేంద్రంలో భూకంపం సంభవించింది. అందరూ నిద్రలో ఉన్న సమయంలో భూ ప్రకంపణలు సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఇళ్లల్లో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.

2 సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూకంప తీవ్రతకు ఇళ్లలోని వస్తువులు కదిలిపోయాయని పేర్కొన్నారు. రిక్టర్‌స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదు అయిందని అధికారులు వెల్లడించారు.  ఉట్నూరు మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని చెప్పారు.

Indonesia Earthquake: ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు.. సునామీ ముప్పుపై అధికారులు ఏమన్నారంటే..

భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు వెల్లడించారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.