Ambulances : బ్రేకింగ్..అంబులెన్స్‌లకు లైన్ క్లియర్

ఏపీతో సహా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అంబులెన్స్ లను ఆపొద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Ambulances : బ్రేకింగ్..అంబులెన్స్‌లకు లైన్ క్లియర్

Telangana-Andhra Pradesh

Updated On : May 14, 2021 / 9:51 PM IST

Telangana : ఏపీ – తెలంగాణ సరిహద్దులో అంబులెన్స్ రాకపోకల్లో నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. ఏపీతో సహా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అంబులెన్స్ లను ఆపొద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇతర రాష్ట్రాల్లో ఉన్న కరోనా రోగులు చికిత్స నిమిత్తం తెలంగాణలో వాలిపోతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ కు భారీగా తరలి వస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్నాటక, తమిళనాడులో కేసులు విపరీతంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా హైదరాబాద్ కు వస్తే..కరోనా బాధితులకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని వెల్లడించింది.

కరోనా బాధితులు హైదరాబాద్ కు వస్తుండడంతో రెండు రోజుల క్రితం సరిహద్దులో పోలీసులు అంబులెన్స్ లను ఆపివేసిన సంగతి తెలిసిందే. చాలా మంది బాధితులు ఇబ్బందులు పడుతుండడంతో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఆసుపత్రి లెటర్, కోవిడ్ కంట్రోల్ రూమ్ నుంచి జారీ చేసిన పాస్‌లు ఉంటేనే అనుమతి ఇస్తున్నారు.

ఈ క్రమంలో..హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు అంబులెన్స్‌లను అడ్డుకోవటంపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. అంబులెన్స్‌లను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. అంబులెన్స్‌లు ఆపే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. తాజాగా..అంబులెన్స్ లకు లైన్ క్లియర్ ఇచ్చింది.

Read More : Telangana Covid : తెలంగాణలో కరోనా..24 గంటల్లో 4 వేల 305 కేసులు