Telangana Covid : తెలంగాణలో కరోనా..24 గంటల్లో 4 వేల 305 కేసులు

Tg Corona Cases
Corona in Telangana : తెలంగాణలో మెల్లిమెల్లిగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుననట్లే అనిపిస్తోంది. 4 వేల 305 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. వైరస్ సోకి..29 మంది ప్రాణాలు వదిలారు. 6 వేల 361 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఒకే రోజు 57 వేల 416 నుంచి శాంపిల్స్ సేకరించారు.
ఇందులో 4 వేల 305 కేసులు వెలుగు చూశాయి. తెలంగాణలో ఇప్పటివరకు 5,20,709 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 4,62,981 కొవిడ్ ప్రభావం నుంచి బయటపడ్డారు. ఇంకా 54,832 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 2,896కి పెరిగింది.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు :
ఆదిలాబాద్ 34. భద్రాద్రి కొత్తగూడెం 130. జీహెచ్ఎంసీ 607. జగిత్యాల 125. జనగామ 63. జయశంకర్ భూపాలపల్లి 76. జోగులాంబ గద్వాల 71. కామారెడ్డి 36. కరీంనగర్ 229. ఖమ్మం 222. కొమరం భీం ఆసిఫాబాద్ 29. మహబూబ్ నగర్ 137. మహబూబాబాద్ 94. మంచిర్యాల 139. మెదక్ 47.
మేడ్చల్ మల్కాజ్ గిరి 291. ములుగు 51. నాగర్ కర్నూలు 143. నల్గొండ 246. నారాయణపేట్ 26. నిర్మల్ 25. నిజామాబాద్ 82. పెద్దపల్లి 134. రాజన్న సిరిసిల్ల 71. రంగారెడ్డి 293. సంగారెడ్డి 111. సిద్ధిపేట 169. సూర్యాపేట 31. వికారాబాద్ 158. వనపర్తి 110. వరంగల్ రూరల్ 122. వరంగల్ అర్బన్ 128. యాదాద్రి భువనగిరి 75. మొత్తం 4305.
Read More : Tribal Food : ఏపీలో ఉంటున్న వీరికి కరోనా రాలేదు..ఎందుకు ? ఏం తింటున్నారు ?