పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీ ముందు ఉద్రిక్తత.. దాడికి యత్నం..
స్థానికులకు, పల్లా అనుచరులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోచారం పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి.

Palla Rajeshwar Reddy College : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ లో ఉద్రిక్తత నెలకొంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీ ముందు స్థానికులు ఆందోళనకు దిగారు. చెరువు కబ్జా చేశారంటూ నిరసన తెలిపారు. అయితే, స్థానికులపై పల్లా అనుచరులు దౌర్జన్యం చేశారు. దాడికి యత్నం చేశారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కాలేజీ ముందు ఎలా ధర్నా చేస్తారంటూ వాగ్వాదానికి దిగారు. స్థానికులకు, పల్లా అనుచరులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోచారం పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి.
నాడెం చెరువును పరిరక్షించాలని డిమాండ్..
నాడెం చెరువు బఫర్ జోన్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డి నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది. నాడెం చెరువును పరిరక్షించాలని స్థానికులు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. చెరువుల పరిరక్షణ లక్ష్యంగా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. నాడెం చెరువు మొత్తం 54 ఎకరాల విస్తీరణంలో ఉండేది. ప్రస్తుతం 44 ఎకరాలకు పరిమితమైంది. పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైంది. చెరువును పరిరక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికులు, అనురాగ్ కాలేజీ సిబ్బంది మధ్య వాగ్వాదం..
ఇందులో భాగంగా అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీ ముందు స్థానికులు మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. కాలేజీ ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదంటూ స్థానికులతో చెప్పారు. దీనిపై వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య పెనుగులాట జరిగింది. దూషణలకు దిగారు. ఒకరిపై మరొకరు చేయి చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది.
పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనుగార్ యూనివర్సిటీకి సంబంధించి బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పల్లా స్పందించారు. తాను ఎక్కడా ఆక్రమణలు చేయలేదన్నారు.
Also Read : నా స్కూల్ జోలికొస్తే చావడానికైనా రెడీ..!- ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి సంచలన వ్యాఖ్యలు