లాక్ డౌన్ మరింత కఠినతరం… సీజ్ చేసిన వాహనాలు ఇప్పట్లో ఇవ్వం : సీపీ

లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అనసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు.

లాక్ డౌన్ మరింత కఠినతరం… సీజ్ చేసిన వాహనాలు ఇప్పట్లో ఇవ్వం : సీపీ

Updated On : September 22, 2021 / 3:40 PM IST

లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అనసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు.

లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అనసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు. సోమవారం (ఏప్రిల్ 20, 2020) ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు మూడు లక్షల వాహనదారులపై చేశామని చెప్పారు. సీజ్ చేసిన వాహనాలను ఇప్పట్లో ఇచ్చే ప్రసక్తి లేదన్నారు.

లాక్ డౌన్ తర్వాత కూడా వాహనాలు తీసుకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని చెప్పారు. విధుల్లో ఉన్న పోలీసులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులకు మాస్కులు, గ్లౌజులు పంపిణీ చేశామని తెలిపారు.

వలస కూలీల సమస్యలు పరిష్కారమయ్యాయని చెప్పారు. ఇంటి యజమానులు అద్దే కోసం కిరాయిదారులను వేధించవద్దని సూచించారు. ఎవరైనా వేధింపులకు గురిచేస్తే సమాచారమివ్వాలని, ఇంటిఓనర్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.