Lockdown : త్వరలో తెలంగాణాలో లాక్ డౌన్..ప్రభుత్వం కసరత్తు!

Telangana government lockdown
Telangana government lockdown : తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ దూసుకెళుతోంది. అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. అయినా..కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. లాక్ డౌన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
లాక్ డౌన్ పై ప్రభుత్వానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నివేదిక సమర్పించింది. ఇప్పటికే హోం శాఖకు ప్రతిపాదనలు అందాయి. హోం మంత్రి మహమూద్ ఆలీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. హోమ్ సెక్రటరీ, డీజీపీ, పలువురు కమీషనర్లు పాల్గొన్నారు. 2021, ఏప్రిల్ 30 తర్వాత..లాక్ డైన్ పెట్టాలని సర్కార్ యోచిస్తోంది.