లాక్‌డౌన్‌లో కీచకులు: టీనేజర్‌పై ముగ్గురు మైనర్లతో సహా ఏడుగురు రేప్

  • Published By: Subhan ,Published On : May 1, 2020 / 12:14 PM IST
లాక్‌డౌన్‌లో కీచకులు: టీనేజర్‌పై ముగ్గురు మైనర్లతో సహా ఏడుగురు రేప్

Updated On : June 26, 2020 / 8:40 PM IST

ముగ్గురు మైనర్లతో పాటు ఏడుగురు కలిసి ఓ టీనేజర్ ను రేప్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని బీటల్ జిల్లాలో జరిగింది. సోదరుడితో కలసి ఇంటికి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గ్రామంలోని వేరే ప్రాంతానికి వెళ్లి వస్తున్నారు. ఇంతలో మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు ఇద్దరినీ పిసాజోడీ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. 

ఏప్రిల్ 29, ఏప్రిల్ 30 రోజుల్లో ఈ ఘటన జరిగింది. బాధితురాలి సోదరుడ్ని ఓ బావిలోకి తీసేసి ఆమెపై రేప్ జరిపారు. ఘటన జరిగే సమయంలో బావిలో నుంచి వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబం కంప్లైంట్ ఇచ్చింది. 

ఘటనకు పాల్పడిన వారిలో శుభం బెలె, లోకేశ్ సోనీ, సందీప్ ఖతియా, పవన్ బెలేలు నేరానికి పాల్పడినట్లుగా గుర్తించారు. ఖటియా, బెలె, ముగ్గురు మైనర్లను అరెస్టు చేశారు. వారిపై రేప్, హత్యాయత్నం, కిడ్నాపింగ్ సెక్షన్ల మేర కేసులు నమోదు చేశారు. 

ఏప్రిల్ 22న దామో జిల్లాలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన తర్వాతే ఈ ఘటన జరిగింది. నిందితుడు బాలిక కళ్లను డ్యామేజ్ చేయాలని చూశాడు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. (లాక్‌డౌన్ తొలగించనున్న మహారాష్ట్ర)