నమ్మక ద్రోహి : దీక్షిత్ ను చంపింది తండ్రి స్నేహితుడే

  • Published By: madhu ,Published On : October 22, 2020 / 10:37 AM IST
నమ్మక ద్రోహి : దీక్షిత్ ను చంపింది తండ్రి స్నేహితుడే

Updated On : October 22, 2020 / 10:56 AM IST

Mahabubabad Dixit Kidnap, killed by his father’s friend : దీక్షిత్‌ కిడ్నాప్‌ కేసులో పెద్ద హైడ్రామా నడిచింది. దీక్షిత్‌ తండ్రి రంజిత్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడే ఈ మొత్తం ఎపిసోడ్‌ నడిపించినట్టు పోలీసులు నిర్దారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆదివారం దీక్షిత్‌ను బైక్‌పై తీసుకెళ్లిన ఆ వ్యక్తి.. నలుగురు కిడ్నాపర్ల బ్యాచ్‌కి అప్పగించాడు. ఆ తర్వాత తనకేం తెలియనట్టుగా రంజిత్‌తో ఉండిపోయాడు.



కుటుంబసభ్యులు ఏం చేస్తున్నారు..? ఎవరెవర్ని కాంటాక్ట్ అవుతున్నారో గమనించాడు. రంజిత్‌ నివాసం దగ్గర జరిగే సీనంతా ఎప్పటికప్పుడు కిడ్నాపర్లకు చేరవేశాడు. పోలీసుల కదలికల్ని వాచ్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్‌ అంతా తన కిడ్నాప్‌ ముఠాకు చేరవేశాడు. అయితే ఆ వ్యక్తి ఇదంతా చేస్తున్నాడని ఏ నిమిషంలో కూడా రంజిత్ కుటుంబం అనుమానించలేకపోయింది. ఎందుకంటే రంజిత్‌రెడ్డికి అతను అత్యంత సన్నిహితుడు కావడమే.

ఫ్రెండ్‌ ముసుగులో రంజిత్ మిత్రుడు చేసిన దుర్మార్గం అందర్నీ అవాక్కయ్యేలా చేస్తోంది. మరోవైపు కిడ్నాప్ గ్యాంగ్‌లో ఉన్న ఆ నలుగురు ఎవరు..? లోకల్‌గా ఉండేవాళ్లేనా..? లేదంటే ప్రొఫెషనల్ కిడ్నాపర్ల అన్నది తేలాల్సి ఉంది. స్థానికంగా ఉండే వాళ్లకి టెక్నాలజీపై అంతగా పట్టు ఉందంటే నమ్మలేం. వాళ్లు కచ్చితంగా టెక్నాలజీ మీద గ్రిప్ ఉన్న వాళ్లేనని స్పష్టమవుతోంది.



కిడ్నాప్‌ డ్రామాకు చాలా రోజులుగా స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది. రంజిత్ ఫ్యామిలీలో ఎవర్ని కిడ్నాప్‌ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందా అని ఆలోచించారు. దీంతో బిడ్డను ఎత్తుకెళ్తేనే అడిగినంత ఇస్తారని భావించి దీక్షిత్‌ను ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది.

టెక్నాలజీని బాగా ఒడిసిపట్టుకున్నారు కిడ్నాపర్లు. అందుకే నాలుగు రోజులు ఎవరికీ చిక్కకుండా తమదైన స్టయిల్‌లో కథను నడిపించారు. బిడ్డ కోసం తల్లిదండ్రులు ఆరాటపడడాన్ని రంజిత్‌ మిత్రుడి ద్వారా తెలుసుకున్నారు. దీంతో ఎలాగైనా డబ్బులు ఇస్తారని కిడ్నాపర్లు డిసైడ్ అయ్యారు. కాకపోతే అంత డబ్బు వాళ్ల దగ్గర ఉందా లేదా అన్నది కిడ్నాపర్లు తెలుసుకోవాలనుకున్నారు.



ఆ క్రమంలోనే స్కైప్‌ సహాయంతో దీక్షిత్‌ తల్లికి కాల్ చేశారు. అదే వాళ్లను పట్టించేలా చేసింది. కిడ్నాపర్లు స్కైప్ ద్వారా కాల్ చేయడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. వెంటనే కిడ్నాపర్లు ఉండే ప్రాంతాన్ని గుర్తించి తెల్లవారుజామున 3 గంటలకు వారిని అదుపులోకి తీసుకున్నారు.



అడిగినంత డబ్బు ఇస్తామని దీక్షిత్ తల్లిదండ్రులు ఎంత బతిమాలుకున్నా కిడ్నాపర్లు కనికరించలేదు. ఎక్కడ తాము దొరికిపోతామోనన్న భయంతో అమాయక చిన్నారిని అన్యాయంగా బలితీసుకున్నారు. నాలుగు రోజులుగా బిడ్డ తిరిగి వస్తాడని ఆశగా తల్లిదండ్రులు ఎదురుచూశారు. కానీ దీక్షిత్ మరణవార్త విని కుప్పకూలిపోయారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు తల్లిడిల్లిపోతున్నారు.