Mahesh Babu Voice : ప్లాస్మా దానంపై మహేశ్ వాయిస్‌.. తెలంగాణ పోలీసుల వినూత్న ప్రచారం

సినీ ప్రముఖులు కూడా కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు అందరికంటే ఒక అడుగు ముందుకు వేశాడు.

Mahesh Babu Support to Plasma Donation Drive: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో కరోనా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా బాధితుల కోసం ఆస్పత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌ దొరకని ఆందోళనకర పరిస్థితి.. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోన్న చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు కూడా కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ముందుకు వస్తున్నారు.

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు అందరికంటే ఒక అడుగు ముందుకు వేశాడు. కరోన కట్టడి కోసం కృషి చేస్తున్న పోలీసులు, వైద్యులకు తన సహకారం అందిస్తూనే ఉన్నాడు. ప్లాస్మా దానం చేయాలంటూ సైబరాబాద్‌ పోలీసులు చేసిన ట్వీట్‌పై మహేష్ స్పందించారు. ప్రతి ఒక్కరు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని అభిమానులకు మహేశ్‌ పిలుపునిచ్చాడు.


కరోనాతో పోరాడుతున్న వారికోసం సాధ్యమైనంత చేయూతనిద్దాం. ప్లాస్మా దాతలు చాలా అవసరం. పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ గారు, సైబరాబాద్‌ పోలీసులు తీసుకున్న చొరవకు నా మద్దతు తెలియజేస్తున్నా’ అంటూ మహేశ్‌ ట్వీట్‌ చేశాడు. తెలంగాణ స్టేట్ పోలీస్ తమ అధికారిక ట్విటర్‌లో మహేశ్‌ బాబు వీడియోతో ప్రజల్లో కరోనా అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయత్నం చేసింది.


జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్‌లో పడేశాడు. బీ అలర్ట్. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మాస్కు తప్పనిసరిగా ధరించండి అంటూ మహేశ్‌ వాయిస్‌తో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ‘మాస్క్ ఈజ్ మస్ట్’ అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేసింది. తెలంగాణ పోలీసు శాఖ ట్వీట్ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు