×
Ad

పాపం పసివాళ్లు.. నాంపల్లి అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవదహనం

Hyderabad Fire Accident : హైదరాబాద్‌లోని అంబిడ్స్ ఫర్నిచర్ దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది.

Hyderabad Fire Accident

Hyderabad Fire Accident : హైదరాబాద్‌లోని అంబిడ్స్ ఫర్నిచర్ దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. ఓ మహిళ, ఇద్దరు చిన్నారులతోసహా వీరిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరు మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. ప్లాస్టిక్‌తో నిండిన పొగతో ఊపిరి ఆడక అక్కడికక్కడే వారు ప్రాణాలు కోల్పోయినట్లు రెస్క్యూ బృందం అంచనా వేస్తోంది.

Also Read : Bridge Stolen: ఎంతకు తెగించార్రా..! రాత్రికి రాత్రే 10 టన్నుల స్టీల్ బ్రిడ్జి మాయం.. దిమ్మతిరిగే దొంగతనం

అగ్నిప్రమాదం ఘటనా స్థలంలో ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి మంటల్లో చిక్కుకున్న ఐదుగురిని  కాపాడేందుకు ప్రయత్నించినా ఇంకా ఫలితం దక్కలేదు. భారీ ఎత్తున ఎగిసిపడిన అగ్నికీలలు, దట్టమైన పొగ కారణంగా భవనంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం సాధ్యం కావడం లేదు.

నాంపల్లి ఫర్నిచర్ షాప్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 20గంటల నుంచి భవనంలో దట్టంగా పొగ అలముకుంది. భవనంలో చిక్కుకున్న ఐదుగురు ఆచూకీ తెలపాలని వారి బంధువులు ఆందోళన చేపట్టారు. పక్క భవనం నుంచి ఫర్నిచర్ భవనం గోడ పగలగొట్టి లోనికి వెళ్లేందుకు బంధువులు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులతో వారు వాగ్వివాదంకు దిగారు.

పొగ తీవ్రతతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. సెల్లార్‌లో దట్టమైన పొగలు వ్యాపిస్తుండడంతో రెస్క్యూ బృందం లోపలికి వెళ్లలేకపోతుంది. 200 మంది సిబ్బందితో రెస్క్యూ కొనసాగుతోంది. కాసేపట్లో నాంపల్లికి జేఎన్టీయూ ఇంజనీరింగ్ బృందం రానుంది. భవనం ధృడత్వంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భవనాన్ని తనిఖీ చేసి ఇంజనీరింగ్ బృందం నివేదిక ఇవ్వనుంది.