Bridge Stolen: ఎంతకు తెగించార్రా..! రాత్రికి రాత్రే 10 టన్నుల స్టీల్ బ్రిడ్జి మాయం.. దిమ్మతిరిగే దొంగతనం

ఈ వంతెన 70 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పుతో ఉంది. దాదాపు 40 ఏళ్ల క్రితం నిర్మించారు.

Bridge Stolen: ఎంతకు తెగించార్రా..! రాత్రికి రాత్రే 10 టన్నుల స్టీల్ బ్రిడ్జి మాయం.. దిమ్మతిరిగే దొంగతనం

Steel Bridge Stolen Representative Image (Image Credit To Original Source)

Updated On : January 24, 2026 / 7:41 PM IST

 

  • ఛత్తీస్‌ఘఢ్‌లోని కోర్బా జిల్లాలో భారీ చోరీ
  • 10 టన్నుల స్టీల్ బ్రిడ్జి దొంగతనం
  • గ్యాస్ కట్టర్లతో సాయంతో ఇనుప రెయిలింగ్‌లను కట్ చేసి

Bridge Stolen: ఛత్తీస్‌ఘఢ్‌లోని కోర్బా జిల్లాలో భారీ చోరీ జరిగింది. 10 టన్నుల బరువు ఉండే ఉక్కు వంతెనను దొంగలు రాత్రికి రాత్రే మాయం చేశారు. హస్డియో లెఫ్ట్ కెనాల్‌పై ఉన్న ఈ స్టీల్ వంతెనను పక్కా ప్లాన్ తో దొంగిలించారు. ఇప్పుడీ ఘటన స్థానికంగానే కాదు దేశవ్యాప్తంగా అందరినీ షాక్ కి గురి చేస్తోంది. వంతెన విషయానికి వస్తే దాన్ని దాదాపు 40 ఏళ్ల క్రితం నిర్మించారు. 70 అడుగుల పొడవు ఉంటుంది. కోర్బా నగరంలోని వార్డ్ నెంబర్ 17 పరిధిలో ధోధిపారా ప్రాంతంలో హస్డియో లెఫ్ట్ కెనాల్‌ పై పాదచారుల కోసం ఈ వంతెన ఏర్పాటు చేశారు.

జనవరి 18న స్టీల్ బ్రిడ్జి కనిపించకపోవడంతో కార్పొరేటర్ లక్ష్మణ్ శ్రీవాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. గ్యాస్ కట్టర్లతో స్టీల్ బ్రిడ్జి ఇనుప రెయిలింగ్‌లను కట్ చేసి.. ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిగా విడదీసి తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు విచారణ కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఈ వంతెన 70 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పుతో ఉంది. బరువు 10 టన్నులపైనే. టెక్నికల్ ఇన్ పుట్స్, విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈ చోరీ ఘటనలో 15 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇతరుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ముకేశ్ సాహు, అస్లామ్ ఖాన్ దీని వెనుక మాస్టర్ మైండ్స్ గా గుర్తించారు.

ఇనుమును స్క్రాప్‌గా అమ్మడానికే వంతెనను దొంగతనం చేసినట్లు విచారణలో నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోందన్నారు. కాలువ లోపల దాచిన ఏడు టన్నుల ఉక్కును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దొంగిలించబడిన ఉక్కును రవాణా చేయడానికి ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు. మిగిలిన సామాగ్రిని ఎక్కడ విక్రయించారో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

”దాదాపు 70 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు, 10 టన్నుల కంటే ఎక్కువ బరువు గల ఈ వంతెన సుమారు 40 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. పాదచారుల రాకపోకల కోసం ఈ బ్రిడ్జిని వాడుతున్నారు. ఇంత భారీ నిర్మాణాన్ని రాత్రికి రాత్రికి మాయం చేయడం విస్మయానికి గురి చేసింది” అని స్థానికులు చెప్పారు.

Also Read: ఎంబీబీఎస్ సీటు కోసం కాలు నరుక్కున్న విద్యార్థి.. నిజం ఇలా బయటపడింది