వేదికపై గద్దర్ పాటకు మల్లారెడ్డి అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్

బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణానికి జనాలు భారీగా తరలివచ్చారు.

వేదికపై గద్దర్ పాటకు మల్లారెడ్డి అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్

Updated On : April 27, 2025 / 6:17 PM IST

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్‌) రజతోత్సవ సభ జరుగుతోంది. దీనికి మాజీ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. వేదికపైకి వచ్చి గద్దర్‌ పాటకు ఆయన అదిరిపోయే స్టెప్పులు వేశారు. సభకు వచ్చిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

మల్లారెడ్డి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గతంలోనూ పలుసార్లు మల్లారెడ్డి పలు ఈవెంట్లలో డ్యాన్స్‌ చేశారు. అప్పట్లోనూ ఆయన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి.

బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణానికి జనాలు భారీగా తరలివచ్చారు. నాలుగైదు కిలోమీట‌ర్ల మేర జనాలు బారులు తీరారు. సభా వేదికపై కళాకారులు ఆట‌పాట‌ల‌తో జనాల్లో ఉత్సాహం నింపుతున్నారు.

Also Read: వావ్.. తెలంగాణలో మొట్టమొదటి పేగు మార్పిడి శస్త్రచికిత్స.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల ఘనత

మరోవైపు, ఎల్క‌తుర్తికి అన్నివైపులా వాహ‌నాలు కిలోమీట‌ర్ల మేర బారులు తీరాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్‌ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది.

గ్రామీణ ప్రాంతాల్లోనూ అత్యధిక స్థానాలను కోల్పోయింది. ఎన్నికల్లో ఓడిపోవడం బీఆర్ఎస్‌ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇవాళ జరుగుతోన్న రజతోత్సవ సభ కోసం మాజీ సీఎం కేసీఆర్‌ కొన్ని రోజులుగా అన్ని జిల్లాల నాయకులతో సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

అలాగే, బీఆర్ఎస్‌ ముఖ్యనాయకులు వివిధ నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేశారు. ఈ రజతోత్సవ బహిరంగ సభ దబీఆర్ఎస్‌ తెలంగాణలో మళ్లీ పూర్వవైభవాన్ని పొందడానికి ఓ మైలురాయిగా ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.