Malla Reddy : రేవంత్ రెడ్డికి సవాల్ లైవ్ లో తొడగొట్టిన మల్లారెడ్డి

రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని మల్లారెడ్డి సవాల్ విసిరారు. బుధవారం మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి తన ఆరోపణలు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు.

Mallareddy

Malla Reddy : మంగళవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో పర్యటించారు. ఈ సందర్బంగా అక్కడ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో రేవంత్ టీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఎమ్మెల్యేలపై విమర్శలు గుప్పించారు. ఈ సమయంలోనే మంత్రి మల్లారెడ్డికి సంబందించిన ఆస్తులపై మాట్లాడారు. మంత్రి మల్లారెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడని దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

ఇక ఇదే అంశంపై బుధవారం మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. తన ఆస్తులన్నీ క్లియర్ డాకుమెంట్స్ తో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తామని మల్లారెడ్డి తెలిపారు. నిరూపించకపోతే రేవంత్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు.

పాలు అమ్మి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు మల్లారెడ్డి. తనకు ఎటువంటి అక్రమ ఆస్తులు లేవని అన్ని కష్టపడి సంపాదించినవే అని వివరించారు. ఈ సమయంలోనే తొడగొట్టి సవాల్ విసిరారు మల్లారెడ్డి.. ఎంపీ పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.