Bihar : 28 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాక నిర్ధోషిగా తేల్చిన కోర్టు..భోరున ఏడ్చేసిన బాధితుడు..

28 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాక నిర్ధోషిగా తేల్చింది కోర్టు. దీంతో సదరు బాధితుడు కోర్టులోనే న్యాయమూర్తి ముందు భోరున ఏడ్చేసాడు.

Bihar : 28 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాక నిర్ధోషిగా తేల్చిన కోర్టు..భోరున ఏడ్చేసిన బాధితుడు..

Man Acquitted Of Murder Charges After Spent 28 Years In Jail

Updated On : April 25, 2022 / 10:38 AM IST

Man Acquitted Of Murder Charges After Spent 28 years in Jail : చెయ్యని నేరానికి 28 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడో అమాయకుడు. అలా ఆ బాధితుడి జీవితంలో అత్యంత విలువైన 28 ఏళ్లు జైలు గోడలమధ్య ఆత్మీయులకు దూరంగా నేరస్థుడిలా ముద్ర వేసుకుని జీవించాడు. 28 ఏళ్ల తరువాత ‘న్యాయ’స్థానం అతడికి ‘నిర్దోషి’ అని చెప్పింది. కానీ ఇన్ని సంవత్సరాలు నా జీవితాన్ని కోల్పోయాను..దీనికి బాద్యులు ఎవరు? నా జీవితాన్ని నాకు తెచ్చి ఇచ్చేది ఎవరు? అంటూ న్యాయస్థానంలోనే న్యాయమూర్తి ముందు భోరున విలపించాడా అమాయకుడు. నువ్వు నిర్ధోషివి అని న్యాయమూర్తి చెప్పగానే కోర్టులోనే ఏడ్చాసాడా అమాయకుడు అయిన అతను స్నేహితుడిని హత్య చేశాడంటూ కేసు మోపి జైలుకు పంపించటంతో 28 ఏళ్ల జైలులోనే గడిపాల్సి వచ్చిందా బాదితుడికి..100 మంది దోషులు తప్పించుకున్నా.. ఒక్క నిర్దోషికీ శిక్ష పడకూడదనే భారత న్యాయశాస్త్రం సూత్రం ఈ అమాయకుడి విషయంలో రివర్స్ అయిన ఘటన బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో జరిగింది.

Also read : Mahant Nritya Gopal Das : అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ అధ్యక్షుడి ఆరోగ్యం విషమం

యూపీలోని దేవరియా జిల్లా తాండ్వా గ్రామానికి చెందిన బీర్బల్ భగత్ అనే వ్యక్తి.. బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లా హరిహరపూర్ కు చెందిన సూర్యనారాయణలు స్నేహితులు. 1993 జూన్ 11న సూర్యనారాయణను కలిసేందుకు బీర్బల్ వచ్చాడు. అదే రోజు ఇద్దరూ ముజఫర్ పూర్ కు వెళ్లారు. అప్పట్నుంచి సూర్యనారాయణ కనిపించకుండా పోయాడు. దీంతో 1993లోనే జూన్ 18న సూర్యనారాయణ కొడుకు సత్యనారాయణ తన తండ్రి కనిపించటంలేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలా ఫిర్యాదు చేసిన సత్యనారాయణ తండ్రి స్నేహితుడు అయిన బీర్బల్ పై అనుమానం వ్యక్తంచేస్తూ అతనే మా నాన్నను కిడ్నాప్ చేసి చంపేశాడు అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ఈక్రమంలో కొన్ని రోజుల తర్వాత ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది పోలీసులకు. ఆ మృతదేహం గురించి ఎవరూ రాకపోవడంతో మూడు రోజుల తర్వాత ఖననం చేశారు. ఈక్రమంలో పోలీసులు విడుదల చేసిన ఫొటోల ఆధారంగా అది సూర్యనారాయణ మృతదేహమేనని అతడి కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆ తర్వాత కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. కొన్ని నెలలకు బీర్బల్ ను గోపాల్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికి బీర్బల్ కు 28 ఏళ్లు. అప్పట్నుంచి కోర్టులో కేసు కొనసాగుతునే ఉంది. బీర్బల్ రిమాండ్ లోనే ఉన్నాడు.

గురువారం మరోసారి గోపాల్ గంజ్ జిల్లా కోర్టులో జడ్జి విశ్వభూతి గుప్తా ముందుకు మరోసారి కేసు విచారణకు వచ్చింది. నిందితుడిపై పోలీసులు ఎలాంటి చార్జిషీటు నమోదు చేయలేకపోయారని, కేసుకు సరైన ఆధారాలూ లేవని, మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్, విచారణాధికారి ఒక్కసారి కూడా కోర్టులో హాజరు కాలేదని న్యాయమూర్తి పేర్కొంటు కేసును కొట్టేశారు. బీర్బల్ ను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేశారు.

Also read : CM KCR Yadadri : నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌.. రామలింగేశ్వరస్వామికి తొలిపూజ

వాస్తవానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే విచారణ మొదలైనా.. చాన్నాళ్ల పాటు అది మూత పడిందని, దీంతో ఇప్పుడు జిల్లా కోర్టులో విచారణకు వచ్చిందని డిఫెన్స్ లాయర్ రాఘవేంద్ర సిన్హా చెప్పారు. బీర్బల్ కు బెయిల్ ఇప్పించటానికి కూడా అతని కుటుంబం యత్నించలేదని అన్నారు. మరోవైపు బీర్బల్ జైలులో ఉన్న సమయంలోనే అతడి తల్లి, తండ్రి చనిపోయారు.

అలా అయినవారిని కోల్పోయి..అమూల్యమైన తన జీవితంలో 28 ఏళ్ల జీవితాన్ని కోల్పోయిన ఆ అమాయకుడు న్యాయమూర్తి ‘నువ్వు నిర్ధోషి’వి అని చెప్పటంతో భోరున ఏడ్చాశాడు ప్రస్తుతం 56 ఏళ్లు వచ్చిన బీర్బల్. ఆ తరువాత మాట్లాడుతూ..‘ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. చెయ్యని నేరానికి 28 ఏళ్లు జైలు శిక్ష అనుభవించా. నేను నిర్దోషిగా విడుదలవుతానన్న ఆశనూ వదిలేసుకున్నా. ఇన్నేళ్లు చాలా కష్టంగా గడిచాయి’’ అని బీర్బల్ ఆవేదన వ్యక్తం చేశాడు.