Afghanistan : అప్ఘాన్‌‌లో మంచిర్యాల వాసి, కాపాడండి అంటూ వేడుకోలు

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన బొమ్మన రాజన్న అనే వ్యక్తి అఫ్ఘానిస్తాన్‌లో చిక్కుకున్నాడు.

Afghanistan : అప్ఘాన్‌‌లో మంచిర్యాల వాసి, కాపాడండి అంటూ వేడుకోలు

Manchiryal

Updated On : August 18, 2021 / 6:47 AM IST

Mancherial Man Stuck : అఫ్ఘానిస్తాన్‌లో చిక్కుకున్న వారిలో పలువురు తెలుగువారు కూడా ఉన్నారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన బొమ్మన రాజన్న అనే వ్యక్తి అఫ్ఘానిస్తాన్‌లో చిక్కుకున్నాడు. అక్కడ కాబూల్‌ ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు. అక్కడ్నుంచి గల్ఫ్‌ సంఘం అధ్యక్షుడు బసంత్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడాడు రాజన్న. రెండ్రోజుల క్రితం అక్కడ ఫైరింగ్‌ జరిగిందని రాజన్న ఫోన్‌లో తెలిపాడు. ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియట్లేదని వాపోయాడు.

Read More : Afghan : భారత్ అండ, అప్ఘాన్ పరిస్థితులపై మోదీ హైలెవల్ మీటింగ్

తనతో పాటు స్థానిక కంపెనీలో పనిచేస్తున్న 14 మంది భారతీయులు ఉన్నట్లు రాజన్న చెబుతున్నాడు. తామందరం ఆగస్ట్ 15న రోజునే ఢిల్లీకి టిక్కెట్లు బుక్ చేశామని.. అంతలోనే తాలిబన్లు నగరంలోకి ప్రవేశించడంతో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోలేకపోయారు. మళ్లీ నేటికి టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లు చెబుతున్నారు. తమను ఎలాగైనా స్వదేశానికి తీసుకెళ్లాలని ఆయన ఫోన్‌లో కోరారు.

Read More : TTD : తిరుమల పవిత్రోత్సవాలు..అంకురార్పణ

రాజన్న అఫ్ఘానిస్తాన్‌లో చిక్కుకుపోవడంతో… ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్నను అఫ్ఘానిస్తాన్‌ నుంచి తీసుకురావడానికి కేంద్రప్రభుత్వం సహకరించాలని గల్ఫ్‌ సంఘం అధ్యక్షుడు బసంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

మరోవైపు…అఫ్ఘాన్‌ తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్న భారత దౌత్యవేత్తలను, అధికారులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చింది. 150 మందిని మిలిటరీ విమానంలో ఢిల్లీకి చేర్చింది. సోమవారం 40 మంది సిబ్బంది భారత్‌కు వచ్చారు. మంగళవారం మరికొంతమందిని తరలించారు. దీంతో కాబూల్‌ ఎంబసీ నుంచి సిబ్బంది తరలింపు ప్రక్రియ పూర్తయినట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇక కాబూల్‌లో ఉంటున్న భారతీయుల వివరాలను సేకరిస్తోంది. వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Read More : Congress Protest : ‘ట్విట్టర్‌ పక్షి’ని వండుకుని తిన్న కాంగ్రెస్ నేతలు