Afghan : భారత్ అండ, అప్ఘాన్ పరిస్థితులపై మోదీ హైలెవల్ మీటింగ్

అఫ్ఘాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రధాని మోదీ.

Afghan : భారత్ అండ, అప్ఘాన్ పరిస్థితులపై మోదీ హైలెవల్ మీటింగ్

Modi

Updated On : August 18, 2021 / 6:34 AM IST

Afghan Situation : అఫ్ఘాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రధాని మోదీ. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. భారత్‌కు రావాలనుకునే అఫ్ఘాన్‌ సిక్కులు, హిందువులకు ఆశ్రయం కల్పించాలని కూడా స్పష్టం చేశారు. భారత్‌ సహాయాన్ని కోరే ప్రతి అఫ్గాన్‌ సోదర సోదరీమణులకు చేయూత అందించాలని మోదీ తెలిపారు.

Read More : TTD : తిరుమల పవిత్రోత్సవాలు..అంకురార్పణ

అఫ్ఘానిస్తాన్‌ ప్రభుత్వాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో… అక్కడి తాజా పరిస్థితులపై చర్చించింది కేంద్ర కేబినెట్‌. అఫ్ఘాన్‌లో నెలకొన్న ప్రస్తుత పరిణామాలపై అధికారులు మోదీకి వివరించారు. భద్రతా పరమైన అంశాలపై సమాచారం అందించారు. రాయబార కార్యాలయం నుంచి సిబ్బందిని తరలించిన విషయాలనూ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. భారత పౌరులను తరలించే అంశంపై 2021, ఆగస్టు 18వ తేదీ బుధవారం మరోసారి చర్చించే అవకాశముంది.

Read More : Afghanistan : ఆఫ్ఘానిస్తాన్‌లో సాధారణ వాతావరణం నెలకొంటుందా?

మరోసారి సెక్యూరిటీ కేబినెట్‌ కమిటీ భేటీ జరుగనుంది. అఫ్ఘాన్‌ తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్న భారత దౌత్యవేత్తలను, అధికారులను ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చింది. 150 మందిని మిలిటరీ విమానంలో ఢిల్లీకి చేర్చింది. సోమవారం 40 మంది సిబ్బంది భారత్‌కు వచ్చారు. మంగళవారం మరికొంతమందిని తరలించారు. దీంతో కాబూల్‌ ఎంబసీ నుంచి సిబ్బంది తరలింపు ప్రక్రియ పూర్తయినట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇక కాబూల్‌లో ఉంటున్న భారతీయుల వివరాలను సేకరిస్తోంది. వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.