Warning Letters : ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలకు.. మావోయిస్టులు, అజ్ఞాత వ్యక్తులు వార్నింగ్ లెటర్స్

ఎమ్మెల్యే చందర్ కు మావోయిస్టులు బహిరంగ లేఖ విడుదల చేయగా, తాజాగా మేయర్ కు మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు వార్నింగ్ లెటర్ పంపారు.

Warning Letters : ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలకు.. మావోయిస్టులు, అజ్ఞాత వ్యక్తులు వార్నింగ్ లెటర్స్

warning letter

Updated On : June 19, 2023 / 1:30 PM IST

Karimnagar Leaders : ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలను వార్నింగ్ లెటర్స్ కలవర పెడుతున్నాయి. మొన్న ఎమ్మెల్యే కోరుగంటి చందర్ కు మావోయిస్టులు లేఖ పంపగా నిన్న రామగుండం మేయర్ అనిల్ కుమార్ కు అజ్ఞాత వ్యక్తుల నుంచి వార్నింగ్ లెటర్ వచ్చింది.

ఎమ్మెల్యే చందర్ కు మావోయిస్టులు బహిరంగ లేఖ విడుదల చేయగా, తాజాగా మేయర్ కు మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు వార్నింగ్ లెటర్ పంపారు. అయితే వార్నింగ్ లెటర్ లో ఏముంది? అన్న విషయాన్ని మేయర్ అనిల్ కుమార్ గోప్యంగా ఉంచుతున్నారు.

Delhi RK puram : ఢిల్లీలో ఇద్దరు మహిళలు దారుణ హత్య

కాగా, వార్నింగ్ లెటర్ పంపిన అజ్ఞాత వ్యక్తుల కోసం పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లెటర్స్ కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు జిల్లా నేతలను వార్నింగ్ లెటర్స్ టెన్షన్ పెడుతున్నాయి.