Delhi RK puram : ఢిల్లీలో ఇద్దరు మహిళలు దారుణ హత్య

మృతులు పింకీ (30), జ్యోతి (29) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Delhi RK puram : ఢిల్లీలో ఇద్దరు మహిళలు దారుణ హత్య

Two women kill

Updated On : June 19, 2023 / 10:24 AM IST

Two Women Kill : ఢిల్లీ ఆర్కేపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అంబేద్కర్ బస్తీ ఏరియాలో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

మృతులు పింకీ (30), జ్యోతి (29) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ముందు మృతుల సోదరుడిని కలిసేందుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Uttar Pradesh : జై శ్రీరాం అనాలంటూ.. వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టి, జుట్టు కత్తిరింపు

ఆ ముగ్గురు వ్యక్తులు మనీ సెటిల్ మెంట్ విషయంలో అతనితో గొడవ పడినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. అనుమానితులు అర్జున్, మైఖైల్, దేవ్ లను అదుపులోని తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు.