Hyderabad: హైద‌రాబాద్‌లో భారీ చోరీ.. కత్తులు, గ‌న్స్‌తో ఇంట్లోకి చొరబడ్డ పదిమంది దుండగులు.. వీడియో వైరల్

హైదరాబాద్ దోమలగూడలోని అరవింద్ నగర్ కాలనీ భారీ దొంగతనం జరిగింది. బంగారు ఆభరణాలు తయారుచేసే వ్యక్తి ఇంటికి తెల్లవారు జామున మూడు గంటల సమయంలో..

Hyderabad: హైద‌రాబాద్‌లో భారీ చోరీ.. కత్తులు, గ‌న్స్‌తో ఇంట్లోకి చొరబడ్డ పదిమంది దుండగులు.. వీడియో వైరల్

Theft in Hyderabad

Updated On : December 13, 2024 / 12:53 PM IST

Theft in Hyderabad: హైదరాబాద్ దోమలగూడలోని అరవింద్ నగర్ కాలనీలో భారీ దొంగతనం జరిగింది. బంగారు ఆభరణాలు తయారు చేసే వ్యక్తి ఇంటికి తెల్లవారు జామున మూడు గంటల సమయంలో వచ్చిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. దాదాపు పది మంది దుండుగులు మాస్కులు ధరించి వచ్చి ఇంట్లోకి చొరబడ్డారు. డమ్మీ ఫిస్టళ్లు, కత్తులతో బంగారం వ్యాపారిని బెదిరించి బీరువాలో ఉన్న రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను, ఆరు సెల్ పోన్లను దోచుకెళ్లారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దొంగతనంకు సంబంధించి దృశ్యాలు ఇంటి ద్వారం వద్ద ఏర్పాటు చేసిన సీసీ పుటేజీల్లో రికార్డయ్యాయి.

Also Read: Mohan Babu : మోహ‌న్ బాబు ఇంటికి వెళ్లిన పోలీసులు.. నివాసంలో లేని డైలాగ్ కింగ్‌..!

పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇంద్రజిత్, రంజిత్ అన్నదమ్ములు. కుటుంబ సభ్యులతో పదేళ్ల క్రితం నగరానికి వచ్చి దోమలగూడ అరవింద్ కాలనీలో ఉంటున్నారు. కొంతమంది పనివాళ్లతో ఆర్డర్లపై బంగారు ఆభరణాలను తయారు చేయించి జ్యూవెలరీ షాప్ లకు పంపిస్తుంటారు. అయితే, గురువారం తెల్లవారు జామున ఇంద్రజిత్ ఇంట్లోకి చొరవబడ్డ పదిమంది దుండుగులు అక్కడ పెద్దగా సొత్తు కనిపించక పోవటంతో అతన్ని తీసుకొని పక్కనే మరో ప్లాట్ లో ఉన్న రంజిత్ వద్దకు తీసుకెళ్లారు. ఇంద్రజిత్ డోర్ కొట్టడంతో రంజిత్ తలుపు తీయగా.. ఒక్కసారిగా పది మంది దుండగులు లోపలికి వెళ్లారు. ఇంట్లోని బీరువాలో సుమారు రెండున్నర కిలోల బంగారాన్ని, ఆరు సెల్ ఫోన్లను దోచుకెళ్లారు.

Also Read: ఎన్ని కేసులు పెట్టినా ఆ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు : ఎమ్మెల్సీ కవిత

చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. సీసీ పుటేజ్ దృశ్యాల ప్రకారం.. తెల్లవారు జామున మూడు గంటల సమయంలో ఇంద్రజిత్ డోర్ కొట్టగా రంజిత్ తలుపు తీశాడు. ఆ వెంటనే మాస్కులు ధరించిన పది మంది దుండుగులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి బంగారు నగల వ్యాపారిని బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. సీసీ పుటేజీల ఆధారంగా దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.