Doctor Tweet Viral : 16 ఏళ్ల నాటి నిజాలు వెల్లడిస్తూ హైదరాబాద్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ట్వీట్ వైరల్..

ఒకప్పుడు MBBS పూర్తి చేయడం అంత సుళువు కాదు. ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చేది. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ 16 సంవత్సరాల క్రితం తన కెరియర్ లో ఎదుర్కున్న ఎన్నో సవాళ్లను ట్విట్టర్ లో షేర్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Doctor Tweet Viral : సాధారణంగా డాక్టర్లు అనగానే వారికి ఏ కష్టాలు ఉండవు.. చక్కని జీవితం.. ఆర్ధికంగా కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని అనుకుంటాం. నిజానికి పగలు, రాత్రి ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంతో పాటు వారికి కూడా అనేక సమస్యలు ఉంటాయి. తాజాగా హైదరాబాద్‌కి (hyderabad) చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ (neurologist) డాక్టర్ సుధీర్ కుమార్ (Dr Sudhir Kumar) తన 16 సంవత్సరాల వైద్య వృత్తికి సంబంధించిన అనేక అంశాలు ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు. ఆయన ట్వీట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Engineers Day 2021: ఇంజనీర్లకు ఆదర్శం..నీటి ప్రాజెక్టుల రూపశిల్పి మోక్షగుండం విశ్వేశ్వరయ్య

MBBS పూర్తి చేయడం అంటే మాటలు కాదు. డాక్టర్ అవ్వాలన్న కలతో పాటు చాలా సహనం, ఓర్పు అవసరం. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిస్తే కాని పట్టా పొందలేం. ఆ తరువాత ఆ వృత్తికి లభించే గౌరవం.. సంపాదన ఓ రేంజ్ లో ఉంటుందని అందరూ ఊహిస్తారు. కానీ వాళ్లు కూడా ఎన్నో సవాళ్లు ఎదుర్కుని ఓ స్ధాయికి వస్తారు అని కొందరి అనుభవాల ద్వారా తెలుస్తుంది. తాజాగా హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్‌లో న్యూరాలజిస్ట్‌గా ఉన్న డాక్టర్ సుధీర్ కుమార్ తను వైద్య సేవలో ఎదుర్కున్నఅనేక అంశాలను ట్విట్టర్ లో షేర్ చేశారు.

16 ఏళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేసిన సమయంలో తన జీతం కేవలం 9000 రూపాయలు మాత్రమే అని ఆయన వెల్లడించారు. అయితే తక్కువ జీతంతో కూడా సంతోషంగా ఎలా జీవించవచ్చునో తన ప్రొఫెసర్లను ( professors) గమనించిన తర్వాత నేర్చుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే తన తండ్రి పనిచేసే కార్యాలయంలో ప్యూన్ కి వచ్చే జీతం కూడా తనకి రాకపోవడం చూసి తన తల్లి ఎంతో బాధపడేవారని ఆయన షేర్ చేసుకున్నారు. 12 సంవత్సరాలు కష్టపడి చదువుకున్న తర్వాత తనకి వచ్చిన ఆదాయం చూస్తే తల్లికి బాధ కలగడం సహజమేనని ఆయన ట్వీట్‌లో రాశారు.

Telangana Movies : తెలంగాణ కథలకి జై కొడుతున్న టాలీవుడ్..

ఇక చదువుకునే సమయంలో తాను ఎదుక్కున్న ఎన్నో సమస్యల గురించి కూడా కుమార్ ట్వీట్ లో వెల్లడించారు. ఇంటర్వ్యూలకు వెళ్లినపుడు తను పడ్డ కష్టాలు.. బంధువుల తమని ట్రీట్ చేసిన విధానాన్ని ట్వీట్ లో రాసుకున్నారు. ప్రస్తుతం ఆయన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన కష్టానికి కొందరు హేట్యాఫ్ చెబుతున్నారు. యువ వైద్యులకు ఈయన జీవితం స్ఫూర్తి అని కామెంట్లు పెడుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు