Telangana Movies : తెలంగాణ కథలకి జై కొడుతున్న టాలీవుడ్..

గతంతో పోలిస్తే తెలంగాణని ఆధారంగా చేసుకొని వస్తున్న సినిమాలు ఎక్కువే, సాధిస్తున్న విజయాలు కూడా ఎక్కువే. ఇటీవల ఈ నేపథ్యంలోని సినిమాలు ఎక్కవయ్యాయి.

Telangana Movies : తెలంగాణ కథలకి జై కొడుతున్న టాలీవుడ్..

Tollywood producing more Telangana Backdrop Movies

Telangana Movies :  తెలంగాణ(Telangana) సంప్రదాయాన్ని, ఇక్కడి సంస్కృతిని మిగతా వారికి చూపించాలనే ఆలోచనతో ఇప్పుడు మన టాలీవుడ్(Tollywood) డైరెక్టర్స్ జై బోలో తెలంగాణ అంటున్నారు. తెలంగాణ స్లాంగ్ తో, తెలంగాణ పద్ధతులు, తెలంగాణ ఏరియాలలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. గతంతో పోలిస్తే తెలంగాణని ఆధారంగా చేసుకొని వస్తున్న సినిమాలు ఎక్కువే, సాధిస్తున్న విజయాలు కూడా ఎక్కువే.

ఇటీవల ఈ నేపథ్యంలోని సినిమాలు ఎక్కవయ్యాయి. లేటెస్ట్ గా నేచురల్ స్టార్ నాని(Nani), కీర్తి సురేశ్(Keerthy Suresh) జోడీగా నటించిన సినిమా దసరా(Dasara). శ్రీకాంత్ ఓదెల అనే తెలంగాణ యువకుడు ఈసినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. తెలంగాణ ప్రాంతంలోని వీర్లపల్లి అనే గ్రామంలో 90వ దశకంలో నడిచే కథ గా ఈ సినిమాను తెరకెక్కించాడు. పక్కా తెలంగాణ నేటివిటీతో సినిమా తీశాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో అక్కడి రాజకీయాల చుట్టూ తిరిగే పక్కా కమర్షియల్ సినిమాగా ‘దసరా’ తెరకెక్కింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

కమెడియన్ వేణు వెల్దండి తనలోని మరో కోణాన్ని చూపిస్తూ తెలంగాణ మట్టి కథను అందంగా ఆసక్తికరంగా ‘బలగం’ పేరుతో తెరపై ప్రెజెంట్ చేశాడు. నిజాయితీతో కూడిన ఈ ప్రయత్నం ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించింది. ఒక పల్లెటూరిలో అడుగు పెట్టి అక్కడి మనుషుల మధ్య తిరుగుతూ అక్కడ జరిగే కొన్ని వాస్తవ సంఘటనల్ని కళ్ళ ముందు ఉంచుతుంది ‘బలగం’. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సహజ వాతావరణంలో రూపొందిన బలగం సినిమా తెలంగాణ సోల్ అని అందరూ ప్రశంసిస్తున్నారు. చిన్న సినిమాగా రిలీజయిన బలగం భారీ విజయం సాధించింది.

డీజే టిల్లు అంటూ తెలంగాణ, పక్కా హైదరాబాదీ కథ, స్లాంగ్ తో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కించిన సినిమా కూడా భారీ విజయం సాధించింది. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో కూడా సగం తెలంగాణ స్లాంగ్, కథతో తెరకెక్కించి హిట్ కొట్టాడు విశ్వక్. ఇప్పటివరకు ఇటీవల తెలంగాణ నేపథ్యంతో వస్తున్న సినిమాలన్నీ మంచి విజయం సాధించగా త్వరలో మరిన్ని సినిమాలు రాబోతున్నాయి.

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ కూడా పక్కా తెలంగాణ నేటిటివిటీతో ఉండబోతోంది. ఇందులో బాలకృష్ణ తన కెరీర్ లోనే మొదటి సారిగా తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పబోతున్నారు. తెలంగాణాలోని ఒక ఏరియాలో జరిగిన ఎమోషనల్ స్టోరీగా డాటర్ సెంటిమెంట్ ను మిక్స్ చేస్తూ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది విజయదశమి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. బాలయ్య 108వ సినిమాగా సినిమా రూపొందుతోంది.

Honey Rose : నాకు నచ్చిన డ్రెస్ లు వేసుకుంటా.. ఎలాంటి డ్రెస్ లు వేసుకోవాలనేది మా ఇష్టం..

రైటర్ పద్మభూషణ్ సినిమాతో ఫస్ట్ సినిమాతోనే భారీ విజయం సాధించిన మేకర్స్ చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమా తీస్తున్నారు. పేరు ‘మేము ఫేమస్’. ఈ సినిమా పక్కా తెలంగాణా కల్చర్ తోనూ, తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ తోనూ రాబోతోంది. సోషల్ మీడియా స్టార్ సుమంత్ ప్రభాస్ తనే హీరోగా తన డైరెక్షన్ లోనే సినిమా తెరకెక్కుతోంది. తెలంగాణలోని ఒక విలేజ్ లో పని పాట లేకుండా గాలికి తిరిగే ముగ్గురు కుర్రవాళ్ళ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఊర్లోనే ఉంటూ జీవితాన్ని ఏమాత్రం సీరియస్ గా తీసుకోకుండా ఎంజాయ్ చేస్తూ తల్లిదండ్రుల చేత తిట్లు తింటూ ఫేమస్ అవ్వడానికి ప్రయత్నించే యువకుల కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

Rahul Dev : సౌత్ సినిమాల్లో ఇప్పటికి అవే కథలు.. ఏం మారట్లేదు.. స్టార్ విలన్ సంచలన వ్యాఖ్యలు..

ఇక టాలీవుడ్ దాటి తెలంగాణ ఏకంగా బాలీవుడ్ వరకు కూడా పాకింది. సల్మాన్ ఖాన్, పూజాహెగ్డేగా తెరకెక్కుతున్న కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమాలో ఏకంగా తెలంగాణ బతుకమ్మ సాంగ్ నే పెట్టేశారు. తెలుగు మార్కెట్ మీద కన్నేసి ఎక్కువమంది తెలుగు వాళ్ళతో తెరకెక్కుతున్న ఈ బాలీవుడ్ సినిమాలో కూడా తెలంగాణ నేపథ్యం ఉండబోతుంది. ఇలా అనేకమంది డైరెక్టర్స్, హీరోలు కూడా తమ సినిమాల్లో తెలంగాణ నేటివిటీ ఎంతోకొంత ఉండేలా చూసుకుంటున్నారు. మార్కెట్ పరంగా కూడా నైజాం షేర్ ఎక్కువే కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచించి నిర్మాతలు తెలంగాణ నేపథ్యాన్ని సినిమాల్లో పెట్టిస్తున్నారని సమాచారం.