Southwest Monsoon : నైరుతి రుతుపవనాలలో స్తబ్దత
అరేబియా సముద్రంలో గాలుల బలం బలహీనంగా ఉందని పేర్కొన్నారు. అరబ్ కంట్రీస్ వైపు గాలులు వెళ్తున్నాయని చెప్పారు. దీని వల్ల నైరుతి రుతుపవనాలు నెమ్మదించాయని తెలిపారు.

Monsoon
southwest monsoon : ప్రస్తుతం నైరుతి రుతుపవనాలలో స్తబ్దత నెలకొందని వాతావరణ శాఖ అధికారి నాగరత్న తెలిపారు. మే 29న కేరళను తాకిన రుతుపవనాలు..తమిళనాడు, కర్ణాటక, గోవా వరకు విస్తరించాయని వెల్లడించారు. ఈ మేరకు ఆమె 10tvతో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణలోకి రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉందన్నారు.
అరేబియా సముద్రంలో గాలుల బలం బలహీనంగా ఉందని పేర్కొన్నారు. అరబ్ కంట్రీస్ వైపు గాలులు వెళ్తున్నాయని చెప్పారు. దీని వల్ల నైరుతి రుతుపవనాలు నెమ్మదించాయని తెలిపారు.
Heavy Rain : ఏపీ, తెలంగాణకు చల్లటి కబురు..మోస్తరు నుంచి భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు ఆలస్యం అవుతుండటంతో ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుందన్నారు. రుతుపవనాలు రావడానికి ఇంకా రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉందని వెల్లడించారు.