Hyderabad : డేంజర్.. హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం.. ఈ ప్రాంతాల్లో అధికం..
Hyderabad : తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రజలు గజగజా వణికిపోతున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరాన్ని వాయు కాలుష్యం..
Hyderabad
Hyderabad : తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రజలు గజగజా వణికిపోతున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో ఐదు డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దాదాపు 15 జిల్లాల్లో 10డిగ్రీల సెల్సియస్ లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వికారాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, అదిలాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని అనేక మండలాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. అయితే, తెలంగాణలోని మమంగళ, బుధవారాల్లో చలితీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read : Gold silver Rates : బంగారం, వెండి కొనేవాళ్లకు శుభవార్త.. నేటి ధరలు ఇవే..
తెలంగాణపై చలి పులి పంజా విసురుతోంది. రికార్డు స్థాయి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం, రాత్రి వేళల్లో బయటకు రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో బయటకు రావొద్దని, ఒకవేళ వచ్చినా చలి తీవ్రతను తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలాఉంటే.. హైదరాబాద్ నగరంలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం చేరింది.
దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర నగరాలకు ముప్పుగా మారిన వాయు కాలుష్యం తాజాగా.. హైదరాబాద్ నగరాన్ని చుట్టుముట్టింది. భాగ్యనగర వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 255కు చేరుకుని ప్రమాదకర స్థాయికి చేరింది. ముఖ్యంగా బాలానగర్, సనత్ నగర్, జీడిమెట్ల, మల్లాపూర్ వంటి పారిశ్రామిక, రద్దీ ప్రాంతాల్లో కాలుష్యం తీవ్రంగా ఉంది. శీతాకాలపు పొగమంచుకు తోడు వాహనాల ఉద్గారాలు, చెత్త దహనం వల్ల గాలిలో సూక్ష్మ ధూళి కణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సైనసైటిస్, డస్ట్ అలర్జీ, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ముఖ్యంగా ఉదయం వేళల్లో వ్యాయామాలకు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
