Rain Alert: తెలంగాణలో రెయిన్ అలర్ట్.. వచ్చే నాలుగు రోజులు ఆ జిల్లాల్లో ఈదురు గాలులతోకూడిన వానలు

తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Rain Alert: తెలంగాణలో రెయిన్ అలర్ట్.. వచ్చే నాలుగు రోజులు ఆ జిల్లాల్లో ఈదురు గాలులతోకూడిన వానలు

Telangana Rains

Updated On : May 5, 2025 / 8:44 AM IST

Telangana Rains: తెలంగాణలో వాతావరణం ఒక్కోసారి ఒక్కోలా మారిపోతుంది. నిన్నమొన్నటి వరకు వేడి గాలులు, ఎండ వేడిమితో ప్రజలు అల్లాడిపోయారు. అయితే, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రాన్ని భారీ వర్షాలు మంచెత్తనున్నట్లు పేర్కొంది. తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

 

ఇవాళ, రేపు అదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది.

 

హైదరాబాద్ సిటీలోనూ నాలుగు రోజులుపాటు వాతావరణం మేఘావృతం అయ్యి ఉంటుందని, గంటలకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఇదిలాఉంటే.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదివారం ఎండలు దంచికొట్టాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా వేంపల్లిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. దక్షిణ తెలంగాణలో నల్గొండ జిల్లాలో మాత్రమే 43.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

 

ఆదివారం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్ధిపేట, కరీంనగర్, అదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా గంగారంలో అత్యధికంగా 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.