ERC Chairman : వ్యవసాయ బావుల ట్రాన్స్‌‌ఫార్మర్‌‌లకు మాత్రమే మీటర్లు.. రఘునందన్ అర్థం చేసుకోలేదు

కమిషనే మోటర్లకు మీటర్లు పెట్టాలని అంటోందని ఆయన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. కమిషన్ పై మాట్లాడేటప్పుడు అన్ని తెలుసుకొని మాట్లాడాలని సలహా ఇచ్చారు. బావుల వద్ద మీటర్లు ఈఆర్సీ వల్లే

ERC Chairman : వ్యవసాయ బావుల ట్రాన్స్‌‌ఫార్మర్‌‌లకు మాత్రమే మీటర్లు.. రఘునందన్ అర్థం చేసుకోలేదు

Smart

Updated On : April 18, 2022 / 4:26 PM IST

ERC Chairman Sriranga Rao : వ్యవసాయ బావులకు సంబంధించి ట్రాన్స్ ఫార్మర్ లకు మాత్రమే మీటర్లు పెట్టాలని చెప్పామని, ఎక్కడా బావుల దగ్గర మీటర్లు పెట్టాలని తాము చెప్పలేదని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నట్లు, వ్యవసాయ బావులకు సంబంధించి ట్రాన్స్ ఫార్మర్లకు మీటర్లు పెట్టాలని డైరెక్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ మీటర్లు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు. విద్యుత్ సంస్థలకు చేసిన సలహాలు సూచనల కాపీని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కు పంపిస్తాను..ఆయన చదువుకోవాలన్నారు. 2022, ఏప్రిల్ 18వ తేదీ సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత నెలలో విద్యుత్ టారిఫ్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, ఈ టారిఫ్ ఆర్డర్ తోపాటు కొన్ని సలహాలు సూచనలు కూడా డిస్కంలకు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ క్రమంలో.. విద్యుత్ సంస్థలకు కొన్ని కీలకమైన డైరెక్షన్ లు ఇచ్చామన్నారు. అందులో భాగంగానే వ్యవసాయ రంగం కు విద్యుత్ సరఫరా సంబంధించి కొన్ని డైరెక్షన్ లు ఇచ్చామన్నారు.

Read More : AP Current Charges : ప్రజల కోరిక మేరకే విద్యుత్ చార్జీలు పెంచాం – ఎనర్జీ సెక్రటరీ శ్రీధర్

కమిషనే మోటర్లకు మీటర్లు పెట్టాలని అంటోందని ఆయన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. కమిషన్ పై మాట్లాడేటప్పుడు అన్ని తెలుసుకొని మాట్లాడాలని సలహా ఇచ్చారు. బావుల వద్ద మీటర్లు ఈఆర్సీ వల్లే పెట్టాలని ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే విమర్శలు చేస్తున్నట్లు, అయితే ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేదో..లేక అర్థం కాకనో అలా మాట్లాడి ఉంటారన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఎలాంటి మీటర్లు పెట్టాలని చూపించలేదని మరోసారి స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లాలో తమ ఈఆర్సీ బృందం 2022, ఏప్రిల్ 19వ తేదీ మంగళవారం వెళ్తున్నట్లు.. విద్యుత్ సరఫరా, సమస్యలు తెలుసుకుంటామన్నారు.