Minister Harish Rao: జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో 500లీ.ల ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి హరీష్

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి హరీష్ రావు ఆదివారం ప్రారంభించారు

Minister Harish Rao: తెలంగాణలో వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి హరీష్ రావు ఆదివారం ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..తెలంగాణ ప్రజల ఆరోగ్యసంరక్షణ కొరకు టీఆర్ఎస్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని అన్నారు. కరోనా సమయంలో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించి లక్షణాలు ఉన్నవారికి కరోనా వైద్య కిట్లు పంపిణీ చేస్తున్న విషయాన్నీ ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.

Also read: New Smart Phone: Flipkartలో మైక్రోమ్యాక్స్ IN Note 2 సేల్ ప్రారంభం

సంగారెడ్డి, జాహీరాబాద్ ఆసుపత్రులలో సాధారణ డెలివరీలు జరగడంపై ఆసుపత్రి వర్గాలను అభినందించిన మంత్రి హరీష్ రావు..రానున్న రోజుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య 75 శాతం మేర పెరగాలని సూచించారు. అందులో భాగంగా జహీరాబాద్ లో 50 పడకల మాతాశిశు సంక్షేమ హాస్పిటల్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రి సౌకర్యాల కోసం రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నామన్న మంత్రి హరీష్ రావు.. జహీరాబాద్ ఆస్పత్రికి బ్లడ్ స్టోరేజీ సౌకర్యాన్ని లేదా బ్లడ్ బ్యాంక్ ను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

Also read: Protests in Canada: నిరసనలతో అట్టుడుకుతున్న కెనడా.. కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి ప్రధాని

ఇక కరోనా సమయంలో రాష్ట వ్య్రాప్తంగా 20 వేల ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా తీవ్రత కొద్దిగా తగ్గుముఖం పట్టిందని, అయినా ప్రజలందరూ నిబంధనలు పాటించాలని సూచించారు. కరోనా మూడోదశ నుండి బయటపడితే ఎప్పటిలాగే సంక్షేమ పథకాలు మరింత ముందుకు సాగుతాయని మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కె. మానిక్ రావు, టీఎస్ ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

Also read: Shruthi Hassan : ‘బెస్ట్ సెల్లర్’గా శృతిహాసన్.. బాలీవుడ్ వెబ్ సిరీస్

ట్రెండింగ్ వార్తలు