Minister KTR
Minister KTR Fire On Rahul Gandhi :కేసీఆర్ ది కుటుంబ పాలన అంటూ రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్నారు..మరి కాంగ్రెస్ ది కుటుంబ పాలన కాదా..? అని మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీకి బీ టీమ్ అంటూ రాహుల్ చేస్తున్న విమర్శలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మేం బీజేపీకి బీ టీమ్ కాదు కాంగ్రెస్సే సీ టీమ్ అంటూ ‘సీ టీమ్ ’అంటే ఏంటో వివరించారు. సీటీమ్ అంటే చోర్ టీమ్ అంటూ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ ఎద్దేవా చేశారు. రూ.80వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగే అవకాశం ఉందా..? అంటూ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో దొంగను పక్కన పెట్టుకుని రాహుల్ గాంధీ మాపై విమర్శలు చేస్తున్నారు అంటూ విమర్శించారు. రాహుల్ గాంధీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారంటూ మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి బీజేపీకి కోర్ట్ అని ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తించాలి అంటూ సూచించారు. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచిన రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరటం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ ను రేవంత్ బీజేపీ అమ్మేస్తారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఏ టూ జెడ్ కుంభకోణాలు చేసిన పార్టీ కాంగ్రెస్ అంటూ విమర్శించారు. కాంగ్రెస్ అనేది ఓ దగుల్బాజీ పార్టీ అంటూ మండిపడ్డారు. ఏ అంటే ఆదర్శ్, బీ అంటే బోఫోర్స్, సీ అంటే కామన్ వెల్త్ ఇలా చెప్పుకుంటే పోతే జెడ్ వరకు కాంగ్రెస్ చేసిన కుంభకోణాలు ఉన్నాయి అంటూ దయ్యబట్టారు.
భూమి నుంచి ఆకాశం వరకు దోపిడీ చేసిన పార్టీ కాంగ్రెస్సే అన్నారు. ఆకాశం నుంచి అగస్త్య హెలికాఫ్టర్ నుంచి భూగర్భంలో ఉండే బొగ్గు దాకా కుంభకోణాలు చేసిన పార్టీ కాంగ్రెస్ అంటూ ఘాటు విమర్శలు సంధించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర మంత్రులు జైళ్లకు వెళ్లి పార్టీ అని ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణలు జరుగుతున్నాయన్నారు.
BRS is not a B Team of BJP.
Congress is a C Team, Chor Team.
A to Z Scams have been done by Congress Leaders.
Your Congress is headed by a Chor in Telangana who was caught redhanded with Cash and is now selling your party tickets – @KTRBRS pic.twitter.com/mjlZWjxHW3— Krishank (@Krishank_BRS) October 19, 2023
కాగా తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన..బీఆర్ఎస్ పై చేస్తున్న విమర్శలు కాకపుట్టిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ అగ్రనేతలంతా రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్ లు రాహుల్ గాంధీ చేసిన విమర్శలు కౌంటర్లు ఇస్తున్నారు.