Minister KTR : మహిళా రిజర్వేషన్ కోసం నా సీటు పోయినా పర్వాలేదు : మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

KTR Comments Women Reservation Bill
Minister KTR Interesting Comments : మహిళా రిజర్వేషన్ బిల్లుపై మంత్రి కేటీఆర్ ఆసక్తిరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ కోసం తన సీటు పోయినా పర్వాలేదన్నారు. బుధవారం హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని తెలిపారు. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ కోటాలో తన సీటును వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ మహిళా రిజర్వేషన్ లో తన సీటు పోయినా పర్వాలేదన్నారు. ‘మనందరివి చాలా చిన్న జీవితాలు.. అందులో నా పాత్ర నేను పోషించాను అనుకుంటున్నాను’ అని తెలిపారు.
పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతని చెప్పారు. పెట్టుబడులతో ముందుకు వచ్చే కంపెనీలకు అండగా నిలబడుతామని భరోసా ఇచ్చారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే స్థాయికి హైదరాబాద్ చేరుకుంటుందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో 40 శాతానికి పైగా ఫార్మారంగ ఉత్పత్తులు ఇక్కడి నుంచే వస్తున్నాయని తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్ననట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై చర్చ సాగుతోంది.
Minister @KTRBRS speaking after inaugurating @CapitaLand‘s International Tech Park Hyderabad (ITPH). https://t.co/WHxSADA569
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 20, 2023