Minister Sabita Indrareddy : రేపటి నుంచి స్కూల్స్ రీఓపెన్..1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ బోధన : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్ పిల్లలందరికీ స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం బోధన ఉంటుందని వెల్లడించారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ బోధన ఉంటుందని పేర్కొన్నారు.

Minister Sabita Indrareddy : రేపటి నుంచి స్కూల్స్ రీఓపెన్..1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ బోధన : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Sabita

Updated On : June 12, 2022 / 5:09 PM IST

Minister Sabita Indrareddy : జూన్ 13 నుంచి పాఠశాలల పున:ప్రారంభం యధావిధిగా కొనసాగుతోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కరోనా వల్ల రెండేళ్లుగా విద్యావ్యవస్థ అస్తవ్యస్తం మారిందన్నారు. అయినా ఇబ్బందులు లేకుండా విద్య అందించేందుకు కృషి చేశామని చెప్పారు. ప్రభుత్వ స్కూల్స్ పిల్లలకు ఆన్ లైన్ పాఠాలు అందేలా చేశామని పేర్కొన్నారు. టెట్ ఎగ్జామ్ నిర్వహణ బాగా జరిగిందన్నారు. పిల్లలందరికీ కూడా స్కూల్స్ కి స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. అన్ని ఏర్పాట్లు చేయాలని స్కూల్స్ కి ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు.

ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్ పిల్లలందరికీ స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం బోధన ఉంటుందని వెల్లడించారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ బోధన ఉంటుందని పేర్కొన్నారు. ఒక నెల బ్రిడ్జ్ క్లాసెస్ లాగా నిర్వహించాలని టీచర్లకు చెప్పామని తెలిపారు. యథావిధిగా బుక్స్, యూనిఫార్మ్స్ కూడా అందిస్తామని చెప్పారు. ప్రత్యేక చొరవ తీసుకుని పిల్లలకు ఇంగ్లీష్ మీడియం బోధన అందించాలని టీచర్లకు సూచించామని తెలిపారు.

Schools Reopen : జూన్ 13 నుంచే విద్యా సంస్ధలు పునః ప్రారంభం-సబితా ఇంద్రారెడ్డి

ప్రభుత్వ స్కూల్స్ లో టాయిలెట్స్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ను స్థానిక ప్రజాప్రతినిధులు చూసుకోవాలని కోరుతున్నామన్నారు. అన్ని స్కూల్స్ లో మిషన్ భగీరథ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రేపు స్థానిక ప్రజాప్రతినిధులు వారి దగ్గర ఉన్న స్కూల్స్ లో పిల్లలకి స్వాగతం పలకాలని కోరుతున్నామని తెలిపారు.