Minister Sridhar Babu: రేవంత్ మంత్రి వర్గానికి ప్రభుత్వాన్ని నడపడం రావట్లేదా? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్..
వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్లే కార్యక్రమం అందరూ చేస్తున్నారు. ఏదో ఒక విమర్శ చేయాలని చేస్తున్నారు తప్ప..

Minister Sridhar Babu: రేవంత్ ప్రభుత్వానికి పాలన చేత కావడం లేదు. ఎలా పాలించాలో తెలియడం లేదు. అధికారులను కంట్రోల్ చేయలేకపోతున్నారు. శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులను మినహాయిస్తే మిగిలిన వాళ్లంతా కొత్తగా వచ్చారు. వారికి ప్రభుత్వాన్ని నడపటం తెలియడం లేదు.. అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీనిపై 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో మంత్రి శ్రీధర్ బాబు ఏమన్నారంటే..
”రేవంత్ మంత్రివర్గానికి ప్రభుత్వాన్ని నడపటం రావటం లేదు, పాలన చేతకాదు అనటం పూర్తిగా తప్పు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు.. అందులో అనుభవజ్ఞులు ఎవరు? ఇద్దరో ముగ్గురో తప్ప వారి దగ్గర కూడా ఎక్కువ మంది చాలా ఏళ్లు పని చేసిన వారు లేరు. మా దగ్గర అందరూ అనుభవజ్ఞులు. రాజకీయ ప్రస్థానంలో అనుభవం ఉన్న వారే. పాలసీ విధానం ఏ విధంగా చేయాలి అనేది అందరూ తెలిసిన వారే.
ఇంప్లిమెంటేషన్ పబ్లిక్ సర్వెంట్ చేయాలి. అధికారులు చేయాల్సిన అవసరం ఉంది. వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్లే కార్యక్రమం అందరూ చేస్తున్నారు. ఏదో ఒక విమర్శ చేయాలని చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. వారి కంటే మెరుగ్గా పాలన చేస్తున్నాం. సీఎం రేవంత్ తో పాటు మంత్రులంతా మంచి పాలన చేస్తున్నారు” అని మంత్రి శ్రీధర్ బాబు తేల్చి చెప్పారు.