Minister Talasani : దళిత, గిరిజన వర్గాలకు కేంద్రం ఏం చేసింది..? మంత్రి తలసాని

బీజేపీ నేతలకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందన్నారు. బీజేపీ నేతల ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. రాష్ట్రంలో దళిత బంధు అనే గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.

Minister Talasani : దళిత, గిరిజన వర్గాలకు కేంద్రం ఏం చేసింది..? మంత్రి తలసాని

Talasani

Updated On : February 3, 2022 / 6:29 PM IST

Minister Talasani Srinivas Yadav : బీజేపీ, కాంగ్రెస్ నేతలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఇప్పటివరకూ రాజ్యాంగ సవరణ జరగలేదన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అణగారిన వర్గాలకు న్యాయం జరగాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. దళిత, గిరిజన వర్గాలకు కేంద్రం ఏం చేసిందని ప్రశ్నించారు. రైతులకు ఏ ప్రయోజనం చేకూర్చిందని మంత్రి నిలదీశారు.

బీజేపీ నేతలకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందన్నారు. బీజేపీ నేతల ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. రాష్ట్రంలో దళిత బంధు అనే గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో బీజేపీ నేతలు మాట్లాడేది ఏంటో తెలపాలన్నారు. రైతులకు సంబంధించి సబ్సిడీ ఎరువుల విషయంలో కొత పెట్టారని విమర్శించారు.

India Boycott : బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకులను బహిష్కరించిన భారత్

ఈ బడ్జెట్ లో రైతుల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. మూడేళ్ల కాలంలో సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎంపీ కిషన్ రెడ్డి ఏం చేసిండో చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధులను తీసుకురావాలని బీజేపీ నేతలను ఉద్ధేశించి మాట్లాడారు.