Missing Girl Died : మేడ్చల్ జిల్లాలో విషాదం.. జవహర్ నగర్ లో అదృశ్యమైన బాలిక మృతి

మేడ్చల్ జిల్లాలో విషాదం నెలకొంది. జవహర్ నగర్ లో అదృశ్యమైన బాలిక మృతి చెందారు. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Missing Girl Died : మేడ్చల్ జిల్లాలో విషాదం.. జవహర్ నగర్ లో అదృశ్యమైన బాలిక మృతి

missing girl died

Updated On : December 16, 2022 / 2:03 PM IST

missing girl died : మేడ్చల్ జిల్లాలో విషాదం నెలకొంది. జవహర్ నగర్ లో అదృశ్యమైన బాలిక మృతి చెందారు. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఇందు అనే బాలిక దమ్మాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నారు.

రోజూలాగే నిన్న ఉదయం స్కూల్ కు వెళ్లిన విద్యార్థిని ఇందు.. సాయంత్రం పొద్దు పోయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో బాలిక తల్లీదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది.

Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బాలిక అనుమానాస్పద మృతి

బాలిక మృతితో తల్లీదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై అన్నీ కోణాల్లో విచారిస్తున్నారు.