ఎమ్మెల్యే హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ సీపీ ఆఫీసు వద్దకు బీఆర్ఎస్ నేతలు వెళ్లారు.

ఎమ్మెల్యే హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సబితా, గంగుల, ప్రశాంత్ రెడ్డి , పల్లా రాజేశ్వర్ రెడ్డి, తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ సీపీ ఆఫీసు వద్దకు బీఆర్ఎస్ నేతలు వెళ్లారు.

దీంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని అరెస్టు చేయాలని, దాడికి సహకరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

మరోవైపు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడి ఘటనలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అరకపొడి గాంధీతోపాటు 19 మంది పైన కేసులు నమోదయ్యాయి. మరికొంత మందిని కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కేసు నమోదు అయిన వారికి 41 కింద నోటీసులు ఇచ్చి అరెస్టు చేసి వ్యక్తిగత పూచికత్తు మీద విడుదల చేశారు.

 

పాడి కౌశిక్ రెడ్డి ఉదంతంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..

 

ట్రెండింగ్ వార్తలు