పొన్నం ప్రభాకర్ పేరు నా బ్లాక్ డైరీలో మొదటి పేరుగా ఎంట్రీ చేస్తున్నా : కౌశిక్ రెడ్డి

వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. నా నిజాయితీ నిరూపించుకున్నా. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

పొన్నం ప్రభాకర్ పేరు నా బ్లాక్ డైరీలో మొదటి పేరుగా ఎంట్రీ చేస్తున్నా : కౌశిక్ రెడ్డి

MLA Kaushik Reddy

Kaushik Reddy : మంత్రి పొన్నం ప్రభాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య ఎన్టీపీసీ ప్లైయాష్ వివాదం ముదురుతోంది. పొన్నం వంద కోట్ల అవినీతికి పాల్పడినట్లు కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అవినీతికి పాల్పడకపోతే ప్రమాణం చేసేందుకు ముందుకు రావాలని మంత్రికి పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేసిన విషయం తెలిసిందే. తనతో కలిసి హైదరాబాద్ అపోలో వేంకటేశ్వర స్వామి దేవాలయానికి రావాలని, రూ. 100 కోట్ల అవినీతి చేయలేదని నిరూపిస్తే తాను బహిరంగ క్షమాపణ చెబుతానని కౌశిక్ రెడ్డి మంగళవారం సవాల్ చేశారు. కాగా బుధవారం కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్ కు చేరుకున్నాడు.

Also Read : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు.. ఆ ఇద్దరు అగ్రనేతలతో భేటీకి అవకాశం

మంత్రి పొన్నం ప్రభాకర్ దేవాలయం దగ్గర ప్రమాణం చేసేందుకు రాకపోతే అవినీతి చేస్తున్నట్లేనని కౌశిక్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలే సవాళ్లు విసురుతారు… ప్రతి సవాళ్లకు ముందుకురారు. నిన్న హుజురాబాద్ లో కాంగ్రెస్ నేతలు విసిన సవాల్ కు నేను ముందుకెళ్లాను.. వారు రాలేదు. ఇవాళ టీటీడీ దేవాలయానికి వెళ్తాను. మంత్రి పొన్నం ప్రభాకర్ కు అవినీతిలో సంబంధం లేకపోతే అధిక లోడుతో వెళుతున్న ఫ్లై యాష్ ట్యాకర్లు ఎందుకు ఆగవు అంటూ కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. అధిక లోడు కారణంగా రహదారులు దెబ్బతింటున్నాయని అన్నారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, పలువురు నేతలు వెళ్లారు.

Also Read : లోక్‌స‌భ స్పీక‌ర్‌గా ఓం బిర్లా ఎన్నిక.. ప్రధాని మోదీ, రాహుల్ అభినందనలు

ఫిల్మ్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. నా నిజాయితీ నిరూపించుకున్నా. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ ముడుపులు ముట్టకపోతే ఇక్కడికి వచ్చేవారు కదా.. 100 కోట్ల స్కామ్ లో మంత్రి ప్రమేయం ఉందని స్పష్టమవుతుంది. పొన్నం ప్రభాకర్ పేరు నా బ్లాక్ డైరీలో మొదటి పేరుగా ఎంట్రీ చేస్తున్నానని కౌశిక్ రెడ్డి అన్నారు. ఐదేళ్ల తరువాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది.. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. అవినీతి చేసిన మంత్రులను, ఎమ్మెల్యేల పేర్లను బ్లాక్ బుక్ లో రాస్తున్నానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.